Chintamaneni: పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని..బెంగళూరుకు మకాం..!

ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల16 రాత్రి నుంచి చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తోపాటు మరో 14 మంది అనుచరులు బెంగళూరుకు మకాం మార్చినట్టు ప్రాథమిక సమాచారం.

New Update
Chintamaneni: పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని..బెంగళూరుకు మకాం..!

Chintamaneni Prabhakar: ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల16 రాత్రి నుంచి చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తోపాటు మరో 14 మంది అనుచరులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారందరూ బెంగళూరుకు మకాం మార్చినట్టు ప్రాథమిక సమాచారం.

Also Read: పోలింగ్ పెరిగింది.. కాబట్టి గెలిచిదే ఈ పార్టీనే.. అంజాద్ బాషా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..!

హత్యాయత్నం కేసులో ముద్దాయి రాజశేఖర్ ను పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి సినీ పక్కిలో దౌర్జన్యం చేసి బలవంతంగా తీసుకెళ్లాడు చింతమనేని. దీంతో, అతడితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. చింతమనేని అతని అనుచరులను పట్టుకునేందుకు ఆరుగురు సిఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు.

Also Read: కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ ఓడిపోతాయి.. సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు

చింతమనేని అతని అనుచురులపై 353, 224, 225, 143 ,149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నూజివీడు డిఎస్పి లక్ష్మయ్య చింతమనేని కేసును పర్యవేక్షిస్తున్నారు. ముద్దాయి రాజశేఖర్ ను అరెస్ట్ చేసిన పెదవేగి పోలీస్ సిబ్బంది అతడిని కోర్టులో హాజరుపరచగా ఏలూరు జిల్లా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు