Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న!

మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. అలాగే మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథను సైతం భారత రత్న ప్రకటించారు. ఇక ఇటీవలే అద్వానీ, కర్పూరి ఠాకూర్‌కు కూడా కేంద్రం భారతరత్న ప్రకటించింది.

Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న!
New Update

Former Prime Minister PV Narasimha Rao: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది కేంద్రం. పీవీతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, సైంటిస్ట్ స్వామినాథన్ కూడా భారత రత్న ప్రకటించారు. ఈ ఏడాది అంతకముందు కర్పూరి థాకుర్, LK అద్వానికి (Advani) కేంద్రం భారత్ రత్న ప్రకటించిన విషయం తెలిసిందే.

ట్విట్టర్‌లో మోదీ ఏం అన్నారంటే?
'మన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు (PV Narasimha Rao) గారిని భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు గారు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా చేసిన కృషిని ఆయన సమానంగా గుర్తుంచుకుంటారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించింది, దేశం యొక్క శ్రేయస్సు మరియు అభివృద్ధికి బలమైన పునాది వేసింది.

ప్రధానమంత్రిగా నరసింహారావు గారి పదవీకాలం భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లకు తెరిచిన ముఖ్యమైన చర్యలతో గుర్తించబడింది, ఇది ఆర్థిక అభివృద్ధి యొక్క కొత్త శకాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంకా, భారతదేశం యొక్క విదేశాంగ విధానం, భాష మరియు విద్యా రంగాలకు ఆయన అందించిన సహకారం భారతదేశాన్ని క్లిష్టమైన పరివర్తనల ద్వారా నడిపించడమే కాకుండా దాని సాంస్కృతిక మరియు మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన నాయకుడిగా అతని బహుముఖ వారసత్వాన్ని నొక్కి చెబుతుంది.' అని మోదీ ట్వీట్ చేశారు.

పాములపర్తి వెంకట నరసింహారావు (28 జూన్ 1921 - 23 డిసెంబర్ 2004), ఒక భారతీయ న్యాయవాది, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త, అతను 1991 నుంచి 1996 వరకు భారతదేశ 9వ ప్రధానమంత్రిగా పనిచేశారు. 28 జూన్ 1921 లక్నేపల్లి , హైదరాబాద్ రాష్ట్రం బ్రిటిష్ ఇండియా (నేటి తెలంగాణ , భారతదేశం)లో జన్మించారు.

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు నిజమైన పితామహుడు పీవీ. 1991లో పీవీ ముఖ్యమైన ఆర్థిక పరివర్తనను ప్రారంభించడానికి మన్మోహన్ సింగ్‌ను తన ఆర్థిక మంత్రిగా నియమించారు. పీవీ ఆదేశంతో మన్మోహన్ సింగ్ దాదాపుగా దివాలా తీసిన దేశాన్ని ఆర్థిక పతనం నుంచి రక్షించడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) విధానాలను అమలు చేసిన సంస్కరణలు దేశ స్థితిని మార్చేశాయి. ప్రపంచీకరణ దేశంలో ఆయన హయంలోనే మొదలైంది .

పీవీ ప్రొఫైల్:
➡ వరంగల్ (Warangal) జిల్లాలోని నర్సంపేట మండలంలో లక్నేపల్లిలో రత్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జననం(1921 జూన్ 28)

➡ పీవీని దత్తతు తీసుకున్న కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన రంగారావు రుక్మిణమ్మ దంపతులు.

➡ దత్తతు తీసుకోవడంతో తన ఇంటి పేరు పాములపర్తిగా మార్పు.

➡ 1952లో శాసనసభ ఎన్నికల్లో ఓటమి.

➡ 1957లో మంథని నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా ఎన్నిక.

➡ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1971 సెప్టెంబర్ నుంచి1973 జనవరి వరకు పాలన.

➡ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భూసంస్కరణలకు శ్రీకారం.

➡ శాసనసభ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు70 శాతం రిజర్వేషన్ కల్పించిన పీవీ

➡ పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చిన పీవీ.

➡ 17 భాషలు నేర్చుకున్న పీవీ.

➡ 14 భాషల్లో సాహిత్యసేవలు.

➡ 1991 జూన్ నెలలో ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన పీవీ.

➡ దుర్భర పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ.

➡ పీవీ ఆర్థిక లక్ష్యసాధనకు బాసటగా నిలిచిన నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్.

➡ పీవీ నరసింహారావు దార్శనికత్వంలో విచ్చుకున్న నూతన ఆర్థిక సంస్కరణలు.

➡ మరణం: 23 డిసెంబర్ 2004 (వయస్సు 83) ఢిల్లీలో తుది శ్వాస విడిచిన పీవీ.

Also Read: పాక్ ఆర్మీ లెక్క తప్పిందా.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలవబోతుందా..?

#pv-narasimha-rao #bharat-ratna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe