పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభమే కాదు... కొంత కాలంగా రాజకీయ కల్లోలం కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పీటీఐ పార్టీ నేతల అరెస్టులు, ఆందోళనలు, బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగడం వంటివి నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్‌పై వందలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తనను అణచివేసేందుకు ఎన్ని అభియోగాలు మోసినా..అరెస్టు చేసి జైళ్లో పెట్టినా..వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమన్నారు. ఈ క్రమంలోనే ప్రపంచం చరిత్రలో నిలిచిపోయిన దిగ్గజ నేతలతో తనను తాను పోల్చుకున్నారు. అంతర్జాతీయ పత్రిక ది ఇండిపెండెంట్ కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/imran-khan.jpg)
మే 9న పాకిస్తాన్‌లో జరిగిన హింసాకాండ, అరెస్టు అయినప్పటి నుంచి వందలాది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇమ్రాన్ ఖాన్. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. చాలా కేసుల్లో బెయిల్‌పై బయట ఉన్నారు. ఇప్పటివరకు ఇమ్రాన్ ఖాన్ పై 170 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ అంశాలన్నీ రాజకీయ ప్రేరేపితమని ఆయన పార్టీ వాదిస్తోంది.
'వారు మనల్ని ఎంత అణచివేస్తే, మనకు అంత మద్దతు లభిస్తుంది':
ది ఇండిపెండెంట్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'ఆ వ్యక్తులు నన్ను మళ్లీ జైల్లో పెడతారని నాకు తెలుసు. ఇది చేయడానికి వారికి ఎటువంటి సమయం పట్టదు. నేను బయట ఉంటే నా పార్టీ చాలా బలపడుతుందనే భయం ఒక్కటే. అందుకే మమ్మల్ని జైల్లో పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 'మమ్మల్ని ఎంతగా అణిచివేసేందుకు ప్రయత్నిస్తారో, మా పార్టీ పీటీఐకి అంత మద్దతు లభిస్తుంది' అని ఇమ్రాన్ అన్నారు. తనకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలూ లేవని, నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా వంటి నాయకుల అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు.
ప్రధాని పదవికి రాజీనామా చేసిన అనంతరం ఇమ్రాన్ ఖాన్ పై ప్రస్తుత సంకీర్ణ సర్కార్ ఎన్నో కేసులు నమోదు చేసింది. అవినీతి, హత్యలు, దాడులు, ఉగ్రవాదం, దేశద్రో్హం వంటి కేసులు ఆయనపై నమోదు అయ్యాయి. అయితే ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమేనని ఇమ్రాన్ ఖాన్ కొట్టిపారేశారు. తన పార్టీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఇవన్నీ అభియోగాలు మోపుతున్నారని ఆరోపించారు.
'నేను గాంధీజీ ఆలోచనలను అనుసరిస్తున్నాను': పాక్ మాజీ ప్రధాని..!!
శాంతి, అహింస, స్వేచ్చ కోసం పోరాటం చేసిన మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా, జిన్నా లాంటి నిస్వార్థ సేవకులే తనకు స్పూర్తి అంటూ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. గాంధీజీ ఆలోచనలను తాను అనుసరిస్తున్నట్లు చెప్పారు. చరిత్రలో నిలిచిపోయిన గాంధీజీ,నెల్సన్ మండేలా వంటి దిగ్గజ నేతలతో తనను తాను పోల్చుకున్నారు. ఓ అంతర్జాతీయ దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.