EX MP: దళితులు ఇప్పుడు గుర్తుకువచ్చారా?..మాజీ ఎంపీపై దళిత సంఘాల నాయకులు ఫైర్

మాజీ ఎంపీ హర్ష కుమార్ నిర్వహించనున్న దళిత సింహ గర్జన సభను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దళిత సంఘాల నాయకులు. దళితులు ఇప్పుడు గుర్తుకువచ్చారా?. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ కోసమే ఈ దళిత సింహ గర్జన సభ అంటూ దుయ్యబట్టారు. దళితులను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని హెచ్చరించారు.

New Update
EX MP: దళితులు ఇప్పుడు గుర్తుకువచ్చారా?..మాజీ ఎంపీపై దళిత సంఘాల నాయకులు ఫైర్

Mala Mahanadu State President Pushparaj: రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆధ్వర్యంలో దళిత సింహ గర్జన సభను ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్నారు. అయితే, హర్ష కుమార్ నిర్వహిస్తున్న సింహ గర్జన సభను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దళిత సంఘాల నాయకులు. ఆర్టీవీతో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడుతూ హర్ష కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాజకీయ లబ్ధి కోసం సభ నిర్వహించాడని..ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో హర్ష కుమార్ మరో నాటకం మొదలు పెట్టాడని విమర్శలు గుప్పించారు.

Also Read: కోడి కత్తి కేసుకు ఎందుకింత ప్రాధాన్యత.. అసలేం జరిగింది?

హర్ష కుమార్ కు దళితులు ఇప్పుడు గుర్తుకువచ్చారా? అసలు దళితుల కోసం ఏమీ చేశారని ప్రశ్నించారు. ఇంకా ఎన్నాళ్ళు దళితులను మోసం చేస్తావ్? అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతోనే దళితులపై ప్రుమ ఉన్నట్లు సభలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కేవలం, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ కోసమే ఈ దళిత సింహ గర్జన సభ అంటూ దుయ్యబట్టారు. దళితులను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని సూచించారు. హర్షకుమార్ ఇప్పటికైనా న్యాయంగా దళితుల సమస్యలపై పోరాడాలన్నారు.

Also Read: నో డౌట్.. ఈ రెండో యాత్ర సినిమా వైసీపీకి బూస్టర్ డోస్

ఇదిలా ఉండగా, ఏపీలో ఎన్నికల్లు అతి త్వరలో జరగనున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన పోటాపోటీగా సభలు నిర్వహిస్తూ ప్రజల మధ్య తిరుగుతున్నారు. గెలుపు తమదంటే తమదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సైతం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిప్పులు చెరుగుతున్నారు.

Advertisment
తాజా కథనాలు