AP: ఇది సరైన పద్ధతి కాదు: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. మంత్రి పదవిని ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగించాలి తప్పా దాడులకు కాదన్నారు. ఇలానే వైసీపీ వారిపై దాడులు కొనసాగితే ఊరుకోనేదిలేదన్నారు

New Update
AP: ఇది సరైన పద్ధతి కాదు: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి

Ananthapur: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని గత వైసీపీ ప్రభుత్వంలో ఇటువంటి దాడులు ఎప్పుడు చేయలేదని అభిప్రాయపడుతున్నారు.

Also Read: రాష్ట్రంలో బీజేపీ ఫోకస్ ఇదే.. పురంధేశ్వరి సెన్సేషనల్ కామెంట్స్..!

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి మంత్రి పదవి రావడం మంచిదేనని అయితే ఈ అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగించాలి తప్ప వైసీపీ వారిపై దాడులకు కాదన్నారు. రాబోయే కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని కామెంట్స్ చేశారు. ఇకనైన వైసీపీ శ్రేణులపై దాడులు ఆపాలని ఇది ఇలాగే కొనసాగితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్త దగ్గర నుంచి నాయకులు వరకు ప్రతి ఒక్కరు కృషి చేస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు