Mallareddy: సీఎం రేవంత్ ఎఫెక్ట్.. మల్లారెడ్డికి అరెస్ట్ తప్పదా?

TG: మల్లారెడ్డికి భూకబ్జా కేసులో షాక్ తగిలింది. మేడ్చల్ జిల్లా సుచిత్రలో మల్లారెడ్డి ఆయన కుటుంబసభ్యులు కబ్జా చేసినట్లు నిర్దారించారు పోలీసులు. 33 గుంటల సర్కార్ భూమిని ఆయన కబ్జా చేసినట్లు గుర్తించారు. కాగా ఈ కేసులో మల్లారెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.

New Update
Mallareddy: సీఎం రేవంత్ ఎఫెక్ట్.. మల్లారెడ్డికి అరెస్ట్ తప్పదా?

Mallareddy: భూకబ్జా కేసులో ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్ తగిలింది. మేడ్చల్ జిల్లా సుచిత్రలో మల్లారెడ్డి ఆయన కుటుంబసభ్యులు కబ్జా చేసినట్లు నిర్దారించారు పోలీసులు. 33 గుంటల సర్కార్ భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు గుర్తించారు. సుచిత్రలోని సర్వే నంబర్‌ 82లో వివాదాస్పద భూమిపై హైకోర్టు ఆదేశాలున్నా మల్లారెడ్డి కబ్జా చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టుకు పోలీసులు నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని హైకోర్టు సూచించింది. కాగా ఈ కేసులో మల్లారెడ్డి అరెస్టు తప్పదా? అనే చర్చ నెలకొంది. ఇప్పటికే మల్లారెడ్డిపై అనేక భూకబ్జా ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు