కుక్కకు దశదిన కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి జోగయ్య

మీరు పెంపుడు కుక్క పెంచుకుటున్నారా.? అయితే ఈ వార్త మీ కోసమే. ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్క పట్ల అమితమైన ఇష్టం ఉంటుంది. అందరితో కలిసిపోయి ఇంట్లో సభ్యుడిగా మెలిగిపోతాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీ వరకు కుక్కులను ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. వాటికి ప్రత్యేకమై ఆహారం పెడుతూ ఉంటారు. అంతగా ప్రేమించిన కుక్క చనిపోతే సొంత కుటుంబసభ్యుడిని కోల్పోయినంటూ బాధపడుతూ ఉంటారు.

New Update
కుక్కకు దశదిన కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి జోగయ్య

మీరు పెంపుడు కుక్క పెంచుకుటున్నారా.? అయితే ఈ వార్త మీ కోసమే. ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్క పట్ల అమితమైన ఇష్టం ఉంటుంది. అందరితో కలిసిపోయి ఇంట్లో సభ్యుడిగా మెలిగిపోతాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీ వరకు కుక్కులను ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. వాటికి ప్రత్యేకమై ఆహారం పెడుతూ ఉంటారు. అంతగా ప్రేమించిన కుక్క తప్పిపోతేనే పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు. అదే చనిపోతే వారి బాధ మాటల్లో వర్ణించలేము. తాజాగా అలాంటి బాధనే మాజీ మంత్రి హరిరామ జోగయ్య అనుభవిస్తున్నారు.

శాస్త్రోక్తంగా దశదిన కార్యక్రమం..

ఆయన ఇంట్లో 13 సంవత్సరాలు స్నేహంగా మెలిగిన కుక్క చనిపోవడంతో దానికి శాస్త్రోక్తంగా దశదిన కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నివాసం ఉంటున్న జోగయ్య నివాసంలో చాక్లెట్ అనే పేరుతో పిలుచుకునే కుక్క ఎంతో స్నేహంగా మెలుగుతూ ఉండేది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటూ అల్లారుముద్దుగా పెరిగిన చాక్లెట్ గత సోమవారం చనిపోయింది. దీంతో జోగయ్య చలించిపోయారు. దాని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుక్కకు హిందూ శాస్త్రోక్తంగా బ్రాహ్మణులతో కర్మకాండను నిర్వహించారు. చాక్లెట్ తనతో ఉన్నంత కాలం తన దగ్గరకు ఎవరిని రానివ్వకుండా ఉండేదని.. తనని ముట్టుకున్న పదిమంది వరకు ఎమ్మెల్యేలను సైతం ఈ కుక్క కరిసిందని తెలియజేశారు. ప్రతి ఇంటిలో ఒక కుక్క పిల్లను పెంచుకోవటం ఎంతో ఉత్తమమని తెలిపారు. కుక్కలకు ఉన్న విశ్వాసం విధేయత మరే జీవికి ఉండవని చెప్పారు.

publive-image

ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా పెనుమదం గ్రామానికి చెందిన ముద్దాల రాంబాబు 15 ఏళ్ల క్రితం బంధువుల వద్ద నుంచి పెంపుడు కుక్కను తెచ్చుకున్నారు. దానికి సాయి అని పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి సాయి వారి కుటుంబంలో ఒక వ్యక్తిగా మారింది. అయితే కొన్ని రోజుల క్రితమే అనారోగ్యం కారణంగా ఆ పెంపుడు కుక్క మరణించింది. దానికి హిందూ సంప్రదాయ పద్ధతిలో అన్ని కార్యక్రమలు చేసి మరి.. గ్రామంలోని పెద్దలకు భోజనాలు పెట్టారు యజమాని రాంబాబు.

జాగ్రత్తలు తప్పనిసరి..

ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కుక్కల ఆరోగ్య విషయానికి వస్తే.. వాటి ఎదుగుదల, అనారోగ్య విషయాలపై సరైన అవగాహన ఉండటం తప్పనిసరి అంటున్నారు జంతు ప్రేమికులు. మనుషుల్లాగే, పెంపుడు జంతువులు కూడా పెద్దయ్యాక అనేక రకాల ఆరోగ్య పరిస్థితులకు లోనవుతాయంటున్నారు. కీళ్ల వ్యాధులు, గుండె జబ్బులు, డిమెన్షియా, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, కీళ్లనొప్పులు వంటివి కాలక్రమేణా వాటిని ప్రభావితం చేసే కొన్ని వ్యాధులు కూడా వస్తాయని చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు