/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/mla-8.jpg)
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డా. సుధాకర్‌పై పోక్సో కేసు నమోదు అయింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సుధాకర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే డా. సుధాకర్ తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.