Omen Chandy Funeral నేడు కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ అంత్యక్రియలు..!!

కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ అంత్యక్రియలు నేడు జరగున్నాయి. ఆయన పార్థివదేహాన్ని బుధవారం తిరువనంతపురం నుంచి కొట్టాయంలోని ఆయన స్వగ్రామానికి తరలించారు.

New Update
Omen Chandy Funeral నేడు కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ అంత్యక్రియలు..!!

కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ అంత్యక్రియలు నేడు జరగున్నాయి. ఆయన పార్థివదేహాన్ని బుధవారం తిరువనంతపురం నుంచి కొట్టాయంలోని ఆయన స్వగ్రామానికి తరలించారు. చాందీకి గౌరవ సూచకంగా కేరళ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. 79ఏల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఊమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులో మరణించిన సంగతి తెలిసిందే.

publive-image

గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమ్మిత్తం బెంగళూరుకు తరలించారు. ఇందిరా నగర్ లోని చిన్మయ మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఊమెన్ చాందీ మరణ వార్తను ఆయన కుమారుడు తెలియజేశాడు. ఊమెన్ చాందీ మరణవార్త విన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ నేతులు, పలువురు రాజకీయ నేతలు చాందీ మ్రుతికి సంతాపం తెలిపారు. అటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, వాద్రా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, శివసేన ఎంపీ ప్రియాంక చదుర్వేది సంతాపం ప్రకటించారు.

కాగా ఊమెన్ చాందీ పార్దీవదేహాన్ని కొట్టాయం తీసుకువచ్చారు. జిల్లాలోని తిరునక్కర మైదాన్ లో కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నారు. అరంతరం ఆయన భౌతికకాయాన్ని అక్కడి నుంచి పుత్తుపల్లిలోని స్వగ్రుహానికి తరలిస్తారు. పారిష్ చర్చిలో ఊమెన్ చాందీ అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు