Kurnool YCP: కర్నూలు వైసీపీ అభ్యర్థిగా IAS ఇంతియాజ్ కర్నూలు వైసీపీ అభ్యర్థిగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ను సీఎం జగన్ ప్రకటించారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్.. సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. By Jyoshna Sappogula 29 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Kurnool YCP Candidate IAS Imtiaz Ahmed: ఏపీ అధికార పార్టీ వైసీపీలో టికెట్ల కేటాయింపు పర్వం సంచలనాల దిశగా కొనసాగుతుంది. కర్నూలు జిల్లా వైసీపీ అభ్యర్థిగా ఓ IAS బరిలో దిగనున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ.ఎండి ఇంతియాజ్ కు అధిష్టానం అవకాశం కల్పించింది. కర్నూలులో మైనారిటీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడంతో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 2 లక్షల మందికి పైగా ముస్లింలు ఉన్నారని సమాచారం. Also Read: టీడీపీ మాజీ మంత్రి కొడుకు అరెస్ట్ ఇంతియాజ్ స్వగ్రామం కోడుమూరు. సెర్ప్ సీఈఓగా, సీసీఎల్ ఏ సెక్రటరీ గా, మైనార్టీ వెల్ఫేర్ సీఈఓ గా ఇంతియాజ్ అహ్మద్ పని చేశారు. నేడు తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాజీనామా అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ.ఎండి ఇంతియాజ్. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ.ఎండి ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్, సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్ ఈ కార్యక్రమంలో… pic.twitter.com/5lXDJYrsMd — YSR Congress Party (@YSRCParty) February 29, 2024 కర్నూలు వైసీపీ అభ్యర్థిగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ను జగన్ ప్రకటించారు. ఇంతియాజ్ మాట్లాడుతూ..సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశయాల మేరకు కర్నూలు అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత సమస్యలు ఏమున్నా అందరినీ కలుపుకొని వెళ్తానని చెప్పారు. అసమానతలు లేని సమాజం నిర్మించాలని అడుగులు వేస్తున్నానన్నారు. వైసీపీ అమలు చేస్తున్న నవ రత్నాలు ప్రజలకు మేలు చేశాయని కామెంట్స్ చేశారు. కర్నూలు జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. Also Read: జీ న్యూస్-మ్యాట్రిజ్ సంచలన సర్వే .. ఏపీలో గెలిచేది ఎవరంటే? ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. 2019కి ముందు వరకు రెడ్డి సామాజికవర్గమే ఆదిపత్యం నడిచింది. 2019లో సీఎం జగన్ తొలిసారి బీసీ నేత, సంజీవ కుమార్‌కు అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో సంజీవ కుమార్‌ను పక్కన పెట్టిన జగన్ ఇదే నియోజకవర్గం నుంచి ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంకు అవకాశం ఇచ్చారు. అయితే, ఆయన అందుకు నిరాకరించి టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. దీంతో కర్నూలు స్థానం వైసీపీకి ఖాలీ అయింది. తాజాగా ఇంతియాజ్‌కు అవకాశం కల్పించారు. ఇలా కర్నూల్ పార్లమెంట్ వైసీపీ టికెట్ కేటాయింపులు రోజుకో మలుపు తిరుగుతుండడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు . #kurnool-district #former-ias-imtiaz-ahmed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి