Praneet Rao: ప్రణీత్ రావు అరెస్టులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు..!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కీలక సమాచారాన్ని వెల్లడించారు. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు.. అధికారులు.. మీడియా.. రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను టాప్ చేశారని పేర్కొన్నారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరు?
New Update

Former DSP Praneet Rao: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారాన్ని వెల్లడించారు ప్రణీత్ రావు. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. ఫోన్ టాపింగ్ చేసి సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకే ఇచ్చానన్నారు.  ప్రజా ప్రతినిధులు.. అధికారులు.. మీడియా.. రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను టాప్ చేసినట్లు ప్రణీత్ రావు పేర్కొన్నారు. తన పైన ఉన్న ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఎస్ఐబి చీఫ్ కి సమాచారం ఇచ్చానని వెల్లడించారు.

Also Read:  మనీప్లాంట్, తులసి మొక్కలు అక్కడ పెడుతున్నారా? అయితే, జాగత్ర..!

కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా టాప్ చేసినని.. చాలా మంది అధికారులు ప్రజా ప్రతినిధుల , వాట్సాప్ లపై నిగా పెట్టానని.. అయితే, అప్పటి మాజీ చీఫ్ ఆదేశాల మేరకు సమాచారాన్ని ధ్వంసం చేశానని ప్రణీత్ రావు పేర్కొన్నట్లు తెలుస్తోంది. సెల్ ఫోన్లు, హార్డ్ డిస్క్లు, వేల సంఖ్యలో పత్రాలను ధ్వంసం చేశానన్నారు ప్రణీత్ రావు.

Also Read: పండుగల సమయంలో స్వీట్లు తిన్న కొలెస్ట్రాల్‌ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే!

ఇదిలా ఉండగా.. ప్రణీత్ రావు ను మరొకసారి తిరిగి విచారించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఐబి మాజీ చీఫ్ తో పాటు ఎస్పీ, డీఎస్పీ లను విచారించేందుకు రంగం సిద్ధం చేస్తోన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించిందన విషయం తెలిసిందే. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని మాయం చేశారన్న ఆరోపణలపై ప్రణీత్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతర్గత విచారణలో ఆధారాలు లభ్యం అయ్యాయి. ఈనెల 4వ తేదీనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వుల జారీ చేశారు. 

#phone-tapping-case #praneet-rao
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe