నళిని గురితప్పదు.. ముక్కు మీదున్న ఈగను కూడా కాల్చగలదు.. ఉద్యోగ విశేషాలతో మాజీ డీఎస్పీ వీడియో ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని తన ఉద్యోగ జీవిత, శిక్షణ విశేషాలు, సహోద్యోగులతో జ్ఞాపకాలు, కెరీర్ లో మైలురాళ్లను వివరిస్తూ వీడియో విడుదల చేశారు. ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను గురువుగా పేర్కొన్నారు నళిని. ఆయన తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు. By Naren Kumar 18 Dec 2023 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Ex DSP Nalini: నళిని... ప్రత్యేక రాష్ట్రం కోసం డీఎస్పీ వంటి ఉన్నత ఉద్యోగాన్ని కాదని ఉద్యమబాట పట్టిన ఆఫీసర్. ఇన్నాళ్లకు తన ప్రయత్నానికి తగిన గుర్తింపు లభించిందంటూ రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో సుదీర్ఘమైన లేఖతో హర్షాతిరేకాలను వ్యక్తంచేశారు. తన పునర్నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సంతోషాన్నిచ్చినప్పటికీ, తానిప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నందున ఉద్యోగం చేయలేనని పేర్కొన్నారు. తన రాజీనామా, తిరిగి విధుల్లో చేరిక, అనంతరం తాను ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన ఒంటరితనం, వేధన తదితర పరిణామాలన్నిటినీ ఇటీవలే సుదీర్ఘంగా సోషల్ మీడియాలో వివరించారు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ లో నిరసనలు.. 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు తాజాగా, తన ఉద్యోగ జీవితం, శిక్షణ విశేషాలు, సహోద్యోగులతో జ్ఞాపకాలు, కెరీర్ లో మైలురాళ్లను వివరిస్తూ వీడియో విడుదల చేశారు. వీడియోలో ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను తన గురువుగా పేర్కొన్నారు నళిని. ఆయన తనకు ఇన్స్పిరేషన్ అన్నారు. శిక్షణలో తానెంత యాక్టివ్ గా ఉండేదో చెప్తూ - నళిని ముక్కు మీద ఈగను కూడా గురితప్పకుండా కాలుస్తుందని అందరూ పొగిడేవారని గుర్తుచేస్తున్నారు. అయితే, ఆమెకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని వేలాదిమంది డిమాండ్ చేస్తుండగా, ఆమె మాత్రం సున్నితంగా తిరస్కరిస్తున్నారు. తనకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఆ వీడియోను కింది లింక్ లో చూడండి.. #ex-dsp-nalini మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి