Dharmana Krishnadas: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించడంపై ఆర్టీవీతో మాట్లాడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కన్నీరు పెట్టుకున్నారు. 'ఏం సాధించాలని కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టావు తల్లి.. నీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎఫ్ ఐ ఆర్ లో ద్రోహిగా చిత్రీకరించిన కాంగ్రెస్ అంటే ఎందుకు అంత మక్కువ.. కాంగ్రెస్ లో చేరడం వల్ల నీ తండ్రి అకాల మరణాన్ని తట్టుకోలేక ఆగిన ఆ ప్రాణాలు క్షోభిస్తాయి తల్లి' అంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read: అంగన్వాడీ దీక్షా శిబిరం పై విరుచుకుపడ్డ పోలీసులు…దొరికిన వారిని దొరికినట్లు లాగిపడేశారు!
జగన్ మోమన్ రెడ్డికి ఒదార్పు యాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వని కాంగ్రెస్ పార్టీలో చేరడం తప్పు అనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. షర్మిలను రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఎంతో అభిమానిస్తానని చెప్పిన ఆయన.. పిసిసి అధ్యక్షురాలిగా ఊహించలేను అంటూ కామెంట్స్ చేశారు. వైఎస్ రాజశేఖర్ ను, జగన్ ను ద్రోహిగా ముద్ర వేసిన కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల తన దృష్టిలో క్షమించరాని తప్పు చేసిందని అన్నారు.
Also Read: విజయవాడలో ఉద్రిక్తత.. సీఐటీయూ నాయకుడిపై సీఐ దాడి..!
'పిసిసి అధ్యక్షురాలిగా చేరి ఏం సాధిస్తావ్ ?.. తెలంగాణలో పార్టీ పెట్టి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పి చివరికి పార్టీని కాంగ్రెస్ లో కలిపావ్.. అలాంటి నిన్ను ఏ రకంగా నాయకులు నమ్ముతారు' అని ప్రశ్నించారు. ఏపీలో షర్మిల జిల్లాల యాత్రలు చేపట్టిన ఏమీ ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. రాజశేఖర్ చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని అలాంటి పార్టీలో షర్మిల చేరి పెద్ద తప్పు చేసిందని అన్నారు.