గత ఏడాది కాలంగా లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. 71 ఏళ్ల ఈ మాజీ ఆటగాడికి సాయం చేయాలని కపిల్ దేవ్, మొహిందర్ అమర్‌నాథ్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్, మదన్ లాల్, రవిశాస్త్రి, కీర్తి ఆజాద్ వంటి మాజీ ఆటగాళ్లు బీసీసీఐకి విజ్ఞప్తి చేయగా తాజాగా బోర్డు స్పందించింది.
ఈ సంక్షోభ సమయంలో గైక్వాడ్ కుటుంబానికి బీసీసీఐ అండగా ఉంటుందనే భరోసా ఇచ్చినట్లు బీసీసీఐ అపెక్స్ వెల్లడించింది. గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు బీసీసీఐ పర్యవేక్షిస్తూనే ఉంటుందని, ఆయన త్వరగా కోలుకోవాలని, అందుకు ఏ సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసింది.ఇక 1974- 87 మధ్య అన్షుమాన్ గైక్వాడ్ భారత్ తరఫున 15 వన్డేలు, 40 టెస్టులు ఆడాడు. అనంతరం భారత జట్టుకు రెండు సార్లు ప్రధాన కోచ్‌గా పనిచేశారు. 1997-99 మధ్య కాలంలో ఒకసారి కోచ్‌గా వ్యవహరించాడు. కోచ్‌గా ఉన్న సమయంలోనే 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది.