AP: నిబంధనలు పాటించకుండా ఇలా చేశారు.. టీడీపీపై ముక్కాల ద్వారక నాధ్ ఫైర్..!

అధికార బలంతో తనను నిర్బంధించారన్నారు నెల్లూరు కన్యక పరమేశ్వరి ఆలయ మాజీ చైర్మెన్ ముక్కాల ద్వారక నాధ్. తన పదవి కాలం ఉండగానే కొంతమంది ఆలయ కమిటీ చైర్మెన్‌గా ప్రమాణ స్వీకారం చేశారన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా టీడీపీ వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
AP: నిబంధనలు పాటించకుండా ఇలా చేశారు.. టీడీపీపై ముక్కాల ద్వారక నాధ్ ఫైర్..!

Nellore: నెల్లూరు కన్యక పరమేశ్వరి ఆలయ మాజీ చైర్మెన్ ముక్కాల ద్వారక నాధ్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. తన పదవి కాలం ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నప్పటికి.. కొంతమంది ఆలయ కమిటీ చైర్మెన్ గా ప్రమాణ స్వీకారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార బలంతో తనను పోలీసులు ఇంట్లో నుంచి బయటకు రానీయకుండా నిర్బంధించారని మండిపడ్డారు. ఆ సమయంలో కన్యక పరమేశ్వరి ఆలయ నిబంధనలు పాటించకుండా కొంతమంది ఆలయ కమిటీ చైర్మెన్ గా ప్రమాణ స్వీకారం చేశారన్నారు.

Also Read: నందిగామలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కౌన్సిలర్..!

ఆలయంకు సంబంధించి నాలుగు వేల మంది సభ్యులు ఉన్నారని.. వారంత కలిసి నూతన కమిటీని ఎన్నుకోవాలని ఆయన అన్నారు. తెలుగు దేశం పార్టీ అధికారం ఉందని దౌర్జన్యంగా ప్రమాణ స్వీకారం చేయించారని ఫైర్ అయ్యారు. అమ్మ వారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా టీడీపీ వ్యవహరించిందని విమర్శలు గుప్పించారు. ఈ నెల 18 తేదిన ఆలయ సభ్యులతో కలిసి ఆలయంకు వెళ్తామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు