మొన్న రాత్రి తిరుమల అలిపిరి నడకదారిలో బాలుడు కౌశిక్ మీద దాడికిపాల్పడిన చిరుత బోనులో చిక్కింది. బోను ఏర్పాటు చేసిన ఆరుగంటల్లో చిరుతను బోనులో చిక్కుకుంది. ఏపీ అటవీశాఖ, టీటీడీ అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో చిరుతను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ విషయంపై తిరుమల ఏఎఫ్వో స్పందిస్తూ…దాడి జరిగిన రోజు రాత్రే సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసినట్లు, చిరుత అడుగజాడల మీద ఓ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగానే అలిపిరి నుంచి గాలిగోపురం వరకు చిరుత ఎక్కువగా సంచరిస్తున్నట్లు గుర్తించామని..ఆయా ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..ఆపరేషన్ చిరుత… బోనులో చిక్కింది
తిరుమలలో మూడేళ్ల బాలుడు కౌశిక్ పై దాడి చేసిన చిరుతను ఎట్టకేలకు అటవీ అధికారులు పట్టుకుని బంధించారు. బోను ఏర్పాటు చేసిన ఆరుగంటల్లోనే చిరుతను బంధీగా పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం చిరుతను బంధించేందుకు అటవీ ప్రాంతాల్లో బోను ఏర్పాటు చేశారు. వంద ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి..నిన్న అర్థరాత్రి 10.45 గంటలకు చిరుత బోన్ లో పడినట్లు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. ఒక్కరోజు వ్యవధిలోనే చిరుతను బంధించడంపై భక్తులు టీటీడీని అభినందిస్తున్నారు.

Translate this News: