ఆపరేషన్ చిరుత... బోనులో చిక్కింది

తిరుమలలో మూడేళ్ల బాలుడు కౌశిక్ పై దాడి చేసిన చిరుతను ఎట్టకేలకు అటవీ అధికారులు పట్టుకుని బంధించారు. బోను ఏర్పాటు చేసిన ఆరుగంటల్లోనే చిరుతను బంధీగా పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం చిరుతను బంధించేందుకు అటవీ ప్రాంతాల్లో బోను ఏర్పాటు చేశారు. వంద ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి..నిన్న అర్థరాత్రి 10.45 గంటలకు చిరుత బోన్ లో పడినట్లు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. ఒక్కరోజు వ్యవధిలోనే చిరుతను బంధించడంపై భక్తులు టీటీడీని అభినందిస్తున్నారు.

New Update
ఆపరేషన్ చిరుత... బోనులో చిక్కింది

మొన్న రాత్రి తిరుమల అలిపిరి నడకదారిలో బాలుడు కౌశిక్ మీద దాడికిపాల్పడిన చిరుత బోనులో చిక్కింది. బోను ఏర్పాటు చేసిన ఆరుగంటల్లో చిరుతను బోనులో చిక్కుకుంది. ఏపీ అటవీశాఖ, టీటీడీ అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో చిరుతను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ విషయంపై తిరుమల ఏఎఫ్వో స్పందిస్తూ...దాడి జరిగిన రోజు రాత్రే సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసినట్లు, చిరుత అడుగజాడల మీద ఓ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగానే అలిపిరి నుంచి గాలిగోపురం వరకు చిరుత ఎక్కువగా సంచరిస్తున్నట్లు గుర్తించామని..ఆయా ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

శుక్రవారం సాయంత్రం చిరుతను బంధించేందుకు అటవీ ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. చిరుత జాడకోసం దాదాపు 100 సీసీ కెమెరాలను ఏర్పాటుచేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. నిన్న రాత్రి 10.45గంటలకు చిరుత బోన్ లో చిక్కినట్లు అధికారులకుసమాచారం అందించారు. ఒక్కరోజు వ్యవధిలోనే చిరుతను బంధించడంపై టీటీడీని భక్తులు అభినందించారు. కాగా చిరుతకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఈ చిరుతను దట్టమైన అరణ్యంలో వదిలిపెడతామని డిఎఫ్ఓ సతీష్ వెల్లడించారు.

ఆ వేంకటేశ్వరస్వామి దయాతోనే నా మనవడు ప్రాణాలతో బయటపడ్డాడని కౌశిక్ తాత తిమ్మప్ప అన్నారు. నా చేయి పట్టుకుని నడుస్తున్న నా మనవడని అమాంతంగా చిరుత లాక్కెళ్లింది. ఆ సమయంలో ఏ జరుగుతుందో నాకు అర్థం కాలేదు. చిరుత వెనక పరిగెత్తాను. అయితే అది వేగంగా అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులకు సమాచారం అందించానని బాలుడి తాత చెప్పారు. కౌశిక్, తల, మెడ భాగంలో చిరుత పళ్లు దిగాయని.. బాబు ప్రాణాలతో బయటపడతాడని అనుకోలేదని బాబు తండ్రి చెప్పారు. కౌశిక్ తన తాతతో మా వెనక వస్తున్నాడు. మేము ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. చిరుత బాబును ఎత్తుకెళ్లిన తర్వాత మాకు తెలిసింది. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లాము. కౌశిక్ ను ఎత్తుకెళ్లిన 25 నిమిషాల్లో బాబు ఆచుకీ లభ్యం అయ్యింది. దేవుడితో దయతో నాబాబు ఆరోగ్యంగా తిరిగివచ్చాడని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు