Viral: వైరలవుతున్న విదేశీ మహిళ శివతాండవ నృత్యం! ఓ విదేశీ మహిళ మన భారతీయ సంస్కృతి దుస్తులతో శివతాండవ నృత్యం చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో ఆశ్చర్యమేమిటంటే తన పెంపుడు కుక్కతో కలసి ఈ నృత్యాన్ని చేసింది. By Durga Rao 26 Mar 2024 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Anastasiia Beaumont: సోషల్ మీడియా కారణంగా, ఇప్పుడు ప్రపంచంలో ఏం జరిగిన ఇట్టే తెలిసిపోతుంది. ఇంతకుముందు మనం చూడలేని వాటిని ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. ఉదాహరణకు, మనం ఇంట్లో కూర్చున్నప్పుడు వన్యప్రాణుల అద్భుతమైన వీడియోలను చూస్తుంటాము. కొన్నిసార్లు మన కళ్ళకు ఆశ్చర్యం కలిగించే విషయాలను చూసినప్పుడు మనకు ఎంతో అనూభూతినిస్తుంది.అలాంటిదే రోమన్ టీవి షోలో జరిగిన ఒక నృత్యం అలాంటి అనుభూతిని కలిగించింది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. శివ తాండవం లాంటి శక్తివంతమైన ట్యూన్‌కు భారతీయులు నృత్యం చేయడం మనం చాలాసార్లు చూసి ఉంటాము. కాని వైరలైన ఈ వీడియోలో శివ తాండవ్‌పై ఒక విదేశీ మహిళ నృత్యం చేయడాన్ని మీరు చూడవచ్చు. కాని ఈ వీడియోలో ఒక వింత చోటుచేసుకుంది. ఆ విదేశీ మహిళ తన పెంపుడు కుక్క తో కలసి స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. శివ తాండవ్‌పై విదేశీ మహిళ చేసిన డ్యాన్స్ anastasia_beaumont అనే విదేశీ మహిళ తన పెంపుడు కుక్కతో వేదిక ను పంచుకుంది. ఆమె కుక్కతో శివతాండవ్ పాటకు డ్యాన్స్ చేసింది. ఆమె భారతీయ దుస్తులు ధరించి, కుక్కతో కలిసి భారతీయ శైలిలో నృత్యం చేసింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే కుక్క కూడా తన స్టెప్పులతో అదరగొట్టింది. తాను ఈ నృత్యాన్ని ప్రత్యేకంగా భారతీయ ఉపాధ్యాయుడి వద్ద నేర్చుకున్నానని తన ఖాతాలో తెలుపింది.ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో anastasia_beaumont అనే ఖాతాతో పంచుకున్నారు. 54 లక్షల మందికి పైగా దీన్ని లైక్ చేయగా, కోట్లాది మంది చూశారు. అంతే కాదు, వీడియోపై వ్యాఖ్యానిస్తూ, ప్రజలు కూడా అమ్మాయిని చాలా ప్రశంసించారు. ఈ వీడియో క్లిప్ రొమేనియాలోని ఒక టీవీ షో నుండి వచ్చింది. View this post on Instagram A post shared by Anastasiia Beaumont | Founder of DogDanceMania (@anastasiia_beaumont) Also Read: జైలు నుంచే కేజ్రీవాల్ సీఎంగా పనిచేయవచ్చా? చట్టాలు ఏం చెబుతున్నాయి? #pet-dog #foreign-woman #shiv-tandav #anastasiia-beaumont మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి