Voter Registration: ఓటు నమోదుకు మరో మూడు రోజులే గడువు..త్వరపడండి!

ఓటు నమోదు కు మరో మూడు రోజులు మాత్రమే గడువుంది. ఈ నెల 15తో ఈ పక్రియ ముగియనున్నది. అర్హులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ జాతర..ఇవాళ్టి నుంచే నమోదు
New Update

Voter Registration Process: ఓటు నమోదు కు మరో మూడు రోజులు మాత్రమే గడువుంది. ఈ నెల 15తో ఈ పక్రియ ముగియనున్నది. అర్హులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఫిబ్రవరి నుంచి జరుగుతున్న ఓటరు నమోదు ద్వారా ఇప్పటికే జిల్లా ఎన్నికల యంత్రాంగానికి 8 వేలకు పైగా ఫాం-6 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

చివరితేదీ వరకు కూడా ఆన్‌లైన్‌లోగానీ, ఆఫ్‌లైన్‌లో గానీ దరఖాస్తులను స్వీకరించి, అనంతరం వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈనెల 25న తుది జాబితాను ప్రకటించనున్నారు. ఓటరు నమోదుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో స్వీప్‌ ద్వారా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో, విద్యార్థుల్లో భారీ ఎత్తున స్పందన వచ్చిందని చెబుతున్నారు. 2006 మార్చి31లోగా జన్మించిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు పొందాలని, ఫాం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్‌ అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి కే మహేశ్వర్‌ చెప్పారు.

ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చి, ఇక్కడే స్థిరపడ్డ వారు కూడా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓట్లు గైల్లంతైనవారు వారు కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Apply Here

Also Read: నేటి నుంచి రాములోరి కల్యాణానికి స్పెషల్‌ టికెట్లు!

#lok-sabha-elections-2024 #election-commission #voter-registration
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe