One Nation-One ID: ఆధార్ కార్డు తరహాలో విద్యార్థులకు 'అపార్' గుర్తింపు కార్డులు ఆధార్ కార్డు లేకుండా ఎవరైన భారతీయులు ఉన్నారంటే వారు చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతిఒక్కరూ కూడా తమ అవసరాల కోసం ఆధార్‌కార్డును తప్పనిసరిగా తీసుకుంటారు. అయితే ఆధార్ తరహాలోనే దేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు అందించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తలు చేస్తోంది. వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డును తెచ్చే యోచనలో కేంద్ర విద్యాశాఖ ఉంది. By B Aravind 16 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి One Nation-One ID: ఆధార్ కార్డు గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు ప్రతిఒక్కరికీ ఈ ఆధార్ గుర్తింపు కార్డు ఉండాల్సిందే. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు పొందడం కోసం అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార ఇలా అన్ని రంగాల్లో మన వివరాలు తెలియజేసేందుకు ఆధార్ కార్డు కాపీ సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు లేకుండా ఎవరైన భారతీయులు ఉన్నారంటే వారు చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతిఒక్కరూ కూడా ఆధార్‌కార్డును తీసుకుంటారు. అయితే ఆధార్ తరహాలోనే దేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు అందించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తలు చేస్తోంది. వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డు (One Nation, One Student ID Card) ను తెచ్చే యోచనలో కేంద్ర విద్యాశాఖ ఉంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు ఇచ్చేటటువంటి ఈ గుర్తింపు నంబర్‌ను ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (ఏపీఏఏఆర్-అపార్)గా పిలువనున్నారు. Also Read: 10th క్లాస్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఖాళీలు ఎన్నంటే.. అయితే ఈ 'అపార్' (APAAR) ఐడీ కార్డులు ఇచ్చే ప్రక్రియను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ అపార్ ఐడీ కార్డులు ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. వాస్తవానికి ఈ అపార్ నంబర్ అనేది విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ప్రభుత్వ అలాగే ప్రైవేటు విద్యార్థులకు ఈ అపార్ ఐడీ కార్డును ఇవ్వనున్నారు. ఈ కార్డులో ఆ విద్యార్థికి సంబంధించిన అకడమిక్ జర్నీ, చరిత్ర, విజయాలు అన్ని కూడా నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైన సమయంలో విద్యార్థులను ట్రాక్ చేసేందుకు వీలు ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థులకు కొత్త అపార్ గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు ముందుగా వారి తల్లిదండ్రులతో మాట్లాడాలని.. ఇందుకోసం వారి సమ్మతి తీసుకోవాలని కేంద్రం అన్ని పాఠశాలలను కోరింది. అలాగే ఈ ఐడీ ప్రాముఖ్యత గురించి చెప్పేందుకు అక్టోబర్ 16-18 మధ్య విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి సమావేశాలు నిర్వహించాలని సూచనలు చేసింది. మరోవిషయం ఏంటంటే విద్యార్థికి అపార్ ఐడీ కార్డు (APAAR ID Card) ను జారీ చేసేందుకు సమ్మతి తెలిపిన తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా దాన్ని ఉపసంహరించుకోనే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థుల డాటాను రహస్యంగా ఉంచుతామని.. కేవలం ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే పంచుకోవడం అనేది ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ ఐడీ’ స్కీమ్‌పై ఏఐసీటీఈ చైర్మన్ టీజీ సీతారామన్ (T G Sitharam) మాట్లాడుతూ ఆపార్, నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ దేశంలోని విద్యార్థులందరికీ ఒక క్యూఆర్ కోడ్ మాదిరిగా పనిచేస్తుందని తెలిపారు. విద్యార్థి నేర్చుకొన్నటువంటి ప్రతి నైపుణ్యం, సాధించిన విజయాలు అందులో ఉంటాయని పేర్కొన్నారు. Also Read: నీరసంగా మొదలైన దేశీయ మార్కెట్లు #school-students #one-nation-one-id మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి