Diwali Car Offers: అదిరిపోయే దీవాళి ఆఫర్.. ఆ కార్లపై ఏకంగా రూ.లక్ష డిస్కౌంట్!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ దీపావళి సందర్భంగా కార్ల పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్లను ప్రకటించింది.తన కార్ల పై సుమారు లక్ష రూపాయల వరకు భారీ తగ్గింపునిస్తుంది.

New Update
Cars: బంపర్ ఆఫర్..రూ. 4లక్షలకే కొత్త కారు..62వేల డిస్కౌంట్ కూడా...ఈ ఆఫర్ కొద్దిరోజులే..!!

దీపావళి పండుగ వస్తుందంటే చాలు ప్రముఖ కంపెనీలు అన్ని ముందుగానే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ తోవలోకే ఆటోమొబైల్‌ కంపెనీలు కూడా వస్తాయి. ఆ జాబితాలోకి ఇప్పుడు తాజాగా మారుతీ సుజుకీ వంతు వచ్చింది. ఎరీనా మోడళ్ల పై మారుతి సుజుకి భారీ తగ్గింపు ప్రకటించింది.తన కార్ల పై సుమారు లక్ష రూపాయల వరకు భారీ తగ్గింపునిస్తుంది.

మారుతీ సుజుకి అరెనా మోడల్స్‌ కార్ల పై ఉన్న తగ్గింపు ధరల ఆఫర్‌ నవంబర్‌ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పండుగకు ఈ ఆఫర్‌ లిమిటెడ్ గా ఉంటుందని కంపెనీ ముందుగానే ప్రకటించింది. సుజుకి ఎస్ప్రెస్పో కారు పై మొత్తం రూ. 54 వేల వరకు తగ్గింపు ఉంటుందని ప్రకటించింది.

Also read: భగవంత్‌ కేసరి సినిమా పై నటి సంచలన కామెంట్లు!

30,000 క్యాష్ డిస్కౌంట్, 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇంకా 4,000 రూపాయల కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయని కంపెనీ ముందుగానే తెలిపింది. సెలెరియా పై మొత్తం రూ. 59 వేల వరకు తగ్గింపును ప్రకటించింది కంపెనీ. ఇందులో రూ. 35 వేల క్యాష్‌ డిస్కౌంట్‌ కూడా ఉంటుంది. సెలెరియా ధర రూ. 5.37 లక్షల నుంచి రూ. 7.14 లక్షల వరకు ఉంటుంది.

మారుతి సుజుకి వ్యాగన్‌ ఆర్‌ పై మొత్తం రూ. 49 వేల వరకు తగ్గింపు ఇస్తున్నారు. రూ. 25 వేల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ ఉన్నట్లు కంపెనీ ప్రకటించగా..రూ. 20 వేల వరకు ఎక్చ్సేంజ్‌ బోనస్‌ ఉంటుంది. అంతేకాకుండా రూ. 4 వేల కార్పొరేట్‌ తగ్గింపు కూడా ఉంటుంది. వ్యాగన్ ధర రూ. 5.54 లక్షల నుంచి రూ. 7.42 లక్షలు వరకు ఉంటుంది. ( అది కేవలం ఎక్స్ షోరూమ్‌ లలో మాత్రమే).

మారుతి సుజుకి స్విఫ్ట్‌ కారు పై మొత్తం రూ. 49 వేల వరకు తగ్గింపు ఉంది. స్విఫ్ట్‌ ధర రూ. 5. 99 లక్షల నుంచి రూ. 9.03 లక్షలు వరకు ఉంటుంది.ఇక మారుతి సుజుకి ఆల్టో కె 10 కారు పై మొత్తం రూ. 49 వేల వరకు తగ్గింపు ఇవ్వడం జరుగుతుందని కంపెనీ పేర్కొంది. రూ. 30 వేల క్యాష్‌ డిస్కౌంట్‌ తో పాటు రూ. 15 వేల ఎక్స్చేంజ్‌ బోనస్‌ అండ్‌ రూ. 4 వేల కార్పొరేట్‌ బోనస్‌ లు కూడా అందించడం జరుగుతుంది.

ఆల్టో 800పై రూ.15,000, మారుతి ఎకోపై రూ.29,000, మారుతి సుజుకి డిజైర్‌పై రూ.10,000 తగ్గింపు ఉన్నాయి. ఆఫర్‌ పూర్తి వివరాల కోసం సమీపంలోని మారుతీ సుజుకి అరేనా డీలర్‌ను సంప్రదించవచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు