/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-04T200742.013-jpg.webp)
Afternoon lunch: ఆరోగ్యంగా, చురుకుగా ఉండడానికి ప్రతీ ఒక్కరికి మధ్యాహన భోజనం చాలా ముఖ్యమైనది. శరీరం, మెదడు సమర్థవంతంగా పని చేయడానికి అవసరమైన శక్తి, పోషకాలను అందిస్తుంది. ఆరోగ్యకరమైన, పుష్కలమైన పోషకాలతో నిండిన భోజనం మానసిక, శారీరక అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. మధ్యాహన భోజనం ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారాలు చేర్చాలి, ఏవి తినకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యాహన భోజనంలో చేర్చాల్సిన ఆహారాలు
సలాడ్స్: రకరకాల కూరగాయలు, ఆకుకూరలతో కూడిన సలాడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, విటమిన్స్ , మినరల్స్ వంటి పుష్కలమైన పోషకాలు శరీరానికి శక్తిని అందించి చురుకుగా ఉంచుతాయి.
లీన్ ప్రోటీన్: మధ్యాహన భోజనంలో లీన్ ప్రోటీన్ ఎంపిక చేసుకోవడం ఉత్తమం. హై కేలరీ, హెవీ ఫుడ్స్ తీసుకోవడం మంచిది కాదు. లీన్ ప్రోటీన్ ఫుడ్స్ తిన్న వెంటనే రక్తంలో చక్కర పెరగకుండా నియంత్రణలో ఉంచుతాయి.
Also Read : Curd: భారతీయ భోజనంలో.. పెరుగు ఎందుకు ఉంటుందో తెలుసా..?
పెరుగు లేదా రైత: చాలా మంది భోజనం చివరిలో పెరుగు తింటే నిద్ర వస్తుందని మానేస్తారు. కానీ లంచ్ లో పెరుగు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు. పెరుగులోని ప్రీ బయోటిక్ గుణాలు మెరుగైన జీర్ణక్రియకు సహాయపడతాయి.
తృణధాన్యాలు: మధ్యాహన భోజనంలో బ్రౌన్ రైస్, క్వినోవా, రోటీ, హోల్ వీట్ వంటి తృణధాన్యాలను అధిక శక్తిని అందించడానికి సహాయపడతాయి.
పండ్లు: కేలరీస్, ప్రోటీన్ తో భోజనంలో ఏదైనా ఒక ఫ్రూట్ యాడ్ చేయండి. ఇది పోషకాల విలువను మరింత పెంచుతుంది. వీటిలోని ఫైబర్ అధిక బరువు సమస్యలను కూడా తగ్గిస్తుంది.
లంచ్ లో తినకూడని ఆహారాలు
ఫ్రైడ్ ఫుడ్స్: మధ్యాహ్నం లంచ్‌లో భారీగా వేయించిన ఆహారాలు తినవద్దు. సమోసాలు, పకోరాలు, డీప్ ఫ్రై చేసిన వాటిని తినడం తగ్గించుకోండి. మితిమీరిన మసాలా వంటకాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. నూనె ఎక్కువగా ఉండే కూరలను తగ్గించండి.
ప్రాసెస్ చేసిన మాంసాలు: లంచ్ లో ప్రాసెస్డ్ మీట్, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలు తగ్గించండి. ఇవి జీర్ణక్రియకు ఇబ్బందిని కలిగిస్తాయి.
ఫాస్ట్ ఫుడ్స్: కొంత మంది పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, డ్రింక్స్ లంచ్ లో తీసుకుంటారు. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటిలోని నూనెల కారణంగా మబ్బుగా, నీరసంగా అనిపిస్తుంది.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Banana Cup Cake: టేస్టీ, యమ్మీ బనాన కప్ కేక్ .. ఇంత ఈజీనా..! ట్రై చేయండి