Life Style: మీకు కోపం ఎక్కువా? అయితే ఈ ఫుడ్స్ కి కాస్త దూరం గా ఉండండి

కొంత మందికి తరచుగా కోపం, చిరాకు వస్తుంటాయి. ఆహారపు అలవాట్లు కూడా మానసిక స్థితి పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఇలాంటి సమస్య ఉన్న వారు మానసిక స్థితిని ప్రభావితం చేసే కెఫిన్, షుగర్ ఫుడ్స్, ఆల్కహాల్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.

New Update
Life Style: మీకు కోపం ఎక్కువా? అయితే ఈ ఫుడ్స్ కి కాస్త దూరం గా ఉండండి

Life Style: మన రోజూ వారి ఆహారపు అలవాట్లు వ్యక్తిగత ప్రతిస్పందనల పై ప్రభావం చూపుతాయి. అంతే కాదు డైట్, జీవన శైలి విధానాలు శారీరక ఆరోగ్యం కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొంత మందికి చిన్న చిన్న విషయాలకే విపరీతమైన కోపం వస్తుంది. దానికి కారణం మన ఆహారపు అలవాట్లు జీవన శైలి విధానాలు కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. నిరంతరం మానసిక సమస్యలను, చిరాకు, కోపం ఎదుర్కునే వారు ఆరోగ్య సంరక్షణ నిపుణుల సలహా తీసుకోవాలి.

కెఫిన్

కెఫిన్ పదార్థాలు తక్షణ ఎనర్జీ, పని పై శ్రద్ధను పెంచేలా చేస్తాయి. కానీ వీటిని అధిక మోతాదులో తీసుకుంటే మానసిక సమస్యలకు దారి తీస్తుంది. కెఫిన్ శరీరానికి కావల్సిన కంటే ఎక్కువ తీసుకున్నపుడు చికాకు, చంచలత్వం వంటి సమస్యలను కలిగించును. కెఫిన్ పదార్థాలు తినేటప్పుడు మీ శరీర సున్నితత్వాన్ని పరిశీలించండి.. చిరాకు ఎక్కువగా అనిపిస్తే కెఫిన్ తీసుకోవడం తగ్గించండి.

షుగర్ ఫుడ్స్

అధిక చక్కెర ఉన్న పదార్థాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిల్లో మార్పులు ఏర్పడతాయి. ఇవి మానసిక సమస్యలు, చిరాకును కలిగించును. చిరాకు, కోపం , మానసిక సమస్యలు ఉన్న వారు చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలను తక్కువగా తినడం మంచిది.

ప్రాసెస్ చేసిన ఆహారాలు  (Processed Foods)

ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అనారోగ్యమైన కొవ్వులు, అడిటివ్స్, ప్రేసర్వేటివెస్ ఉంటాయి. ఇవి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. అంతే కాదు ఈ ఆహారాలు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన న్యూరోట్రాన్స్మిటర్ పై ప్రభావం చూపుతాయి.

మద్యపానం

మద్యపానం నిరుత్సాహానికి కారణమవుతుంది. అంతే కాదు నిద్ర విధానాలకు భంగం కలిగించును. దీని వల్ల మానసిక కల్లోలం ఏర్పడుతుంది. అతిగా ఆల్కహాల్ తీసుకుంటే మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. ఇది కోపం, చిరాకు సమస్యలకు దారితీయును.

Mental Health Tips: స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఇలా చేయండి.. రిలాక్స్ అవుతారు - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు