Winter Tips: వింటర్ లో ఈ ఫుడ్స్ తింటున్నారా.. మీ పని అంతే..! వింటర్ సీజన్ లో ఇన్ఫెక్షన్స్, వ్యాధులు ఎక్కువగా వస్తాయి. కావున ఆరోగ్యం,ఆహరం పై శ్రద్దగా ఉండాలి. ముఖ్యంగా వింటర్ లో ఇన్ఫెక్షన్స్ , శరీర ఉషోగ్రతల పై ప్రభావం చూపే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. వాటిలో స్ట్రా బెర్రీ, కుకీస్, ఫ్రైడ్ ఫుడ్స్, మష్రూమ్స్, ప్రాన్స్ ఉన్నాయి. By Archana 30 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Winter Tips: చలికాలంలో వాతావరణం లో మార్పులు సహజం. వాతావరణంలో మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. మనం రోజు తినే ఆహారపు అలవాట్లు కూడా వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ కు కారణమవుతాయి. కొంత మందికి ఎక్కువగా బయట ఫుడ్స్ తినే అలవాటు ఉంటుంది. కానీ వింటర్ బయట ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటితో పాటు చలికాలంలో మరికొన్ని ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్స్, ఉష్ణోగ్రతల పై ప్రభావం చూపుతాయి. చలికాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి. స్ట్రా బెర్రీస్ చలికాలంలో స్ట్రా బెర్రీస్ తక్కువగా తీసుకోవాలి. సహజంగా స్ట్రా బెర్రీస్ లో శరీరంలో వేడిని తగ్గించే గుణాలు ఉంటాయి. వేసవి కాలంలో వీటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చలికాలంలో కాస్త దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే శరీరంలో మరింత చల్లదనాన్ని పెంచే అవకాశం ఉంటుంది. బేకరీ ప్రాడక్ట్స్ సహజంగా బేకరీ ప్రాడక్ట్స్ ఫ్రెష్ గా ఉండవు. వాటిని ముందే తయారు చేసి స్టోర్ చేస్తారు. చలికాలంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల స్టోర్ చేసిన వాటి పై ఫంగస్ చేరే ప్రమాదం ఉంటుంది. అవి తింటే ఇన్ఫెక్షన్స్, ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే వాటికి దూరంగా ఉండాలి. ప్రాన్స్ వింటర్ సీజన్ లో రొయ్యలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఈ సీజన్ రొయ్యల కదలిక తక్కువగా ఉంటుంది. దీని వల్ల వాటి శరీరంలో అధిక కొవ్వు ఫార్మ్ అవుతుంది. అందుకని చలికాలంలో వీటికి కాస్త దూరంగా ఉండాలి. ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఈ సీజన్ లో ముఖ్యంగా బయట చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిని తయారు చేసే పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవచ్చు.. దాని వల్ల ఇన్ఫెక్షన్స్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ . అలాగే వింటర్ సీజన్ లో జీర్ణక్రియ ప్రభావంగా పనిచేయదు. ఫ్రైడ్ ఫుడ్స్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. మస్రూమ్ మస్రూమ్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. వాతావరణ మార్పుల కారణంగా ఇవి పెరిగే పరిసరాలు వీటి పై ప్రభావం చూపుతాయి. అలాగే ఇవి శరీరాన్ని చల్లగా మారుస్తాయి. అందుకే వింటర్ వీటికి కాస్త దూరంగా ఉండాలి. ఫ్రిడ్జ్ వాటర్ కొంత మంది బయట వెదర్ ఎంత కూల్ గా ఉన్నా... వాటర్ ఫ్రిడ్జ్ లో పెట్టి మరీ తాగుతారు. చలికాలంలో చల్లటి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల గొంతు నొప్పి, జలుబు సమస్యలు వస్తాయి. గోరు వెచ్చని నీళ్లు తాగడం మంచిది. Also Read: Hair Care: జుట్టు రాలుతుందా? డాన్‌డ్రఫ్ వేధిస్తుందా? ఈ చిన్న చిట్కా పాటించండి చాలు! #winter-health-tips #foods-should-not-eat-in-winter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి