Foods Not to Refrigerate: వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో పెట్టకండి.. విషంగా మారి ప్రాణాలకే ముప్పు!

మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా? ఖాళీగా ఉందని కిచెన్ ఐటెమ్స్ అన్నీ దాంట్లో నిల్వ చేస్తున్నారా..? అయితే మీకు అలర్ట్. కిచెన్‌లో ఎప్పుడూ కనిపించే ఐదు రకాల ఫుడ్స్‌ను ఫ్రిజ్‌లో అస్సలు నిల్వ చేయకూడదు. అవేంటంటే..

Foods Not to Refrigerate: వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో పెట్టకండి.. విషంగా మారి ప్రాణాలకే ముప్పు!
New Update

మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా? ఖాళీగా ఉందని కిచెన్ ఐటెమ్స్ అన్నీ దాంట్లో నిల్వ చేస్తున్నారా..? అయితే మీకు అలర్ట్. కొన్ని రకాల ఆహారాలను ఫ్రిజ్లో స్టోర్ చేయకూడదు. ఎందుకంటే అవి కూలింగ్ టెంపరేచర్స్ వద్ద పాడైపోవచ్చు. వీటిని తింటే ప్రమాదకరమైన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. కిచెన్‌లో ఎప్పుడూ కనిపించే ఐదు రకాల ఫుడ్స్‌ ఐటెమ్స్‌ను ఫ్రిజ్‌లో అస్సలు నిల్వ చేయకూడదు. అవేంటంటే..

వెల్లుల్లిని ఫ్రిజ్‌లో పెడితే, అది బ్యాక్టీరియా, బూజును త్వరగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఒలిచిన వెల్లుల్లిని రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేయకూడదు. ఎందుకంటే ఇవి త్వరగా రియాక్షన్స్‌కు గురికావచ్చు. కొన్ని సెకన్లలోనే బూజు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వెల్లుల్లి చాలా తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు. దీంతో దీని సహజ రుచి తగ్గిపోతుంది. అందుకే వీటి సహజ రుచి, ఆకృతిని కాపాడటానికి గది ఉష్ణోగ్రత వద్ద, వెలుతురు లేని చోట నిల్వ చేయడం మంచిది. వంటల్లో వాడటానికి ముందే పొట్టు తీయాలి, ముందే అన్నీ ఒలిచి పెట్టుకోకూడదు.

ఉల్లిపాయలు గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వీటిని రిఫ్రిజిరేటర్‌లో పెడితే తేమ కారణంగా త్వరగా పాడైపోవచ్చు, బూజు వ్యాపించి కుళ్లిపోవచ్చు. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడితే, వాటిలో ఉండే స్టార్చ్ చక్కెరగా మారడం ప్రారంభిస్తుంది. దీంతో తేమ వాతావరణంలో వాటిపై బూజు ఏర్పడవచ్చు. ఒకవేళ సగం కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు మిగిలితే, వాటిని సీల్డ్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో రెండు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు.

అల్లాన్ని మరీ తక్కువ ఉష్ణోగ్రతల వద్ద స్టోర్ చేస్తే, త్వరగా బూజు పట్టి కుళ్లిపోవచ్చు. వీటిని అలాగే ఉపయోగిస్తే కాలేయం, మూత్రపిండాల వైఫల్యానికి కారణం కావచ్చు. అందుకే దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచడం మంచిది. అలా కాకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉన్న అల్లాన్ని రిఫ్రిజిరేటర్‌లో పెడితే, బ్యాక్టీరియాకు నిలయంగా మారి కొత్త సమస్యలు తీసుకొస్తుంది. వినియోగానికి పనికి రాకుండా తయారవుతుంది.

చాలామంది బ్రెడ్‌ను రిఫ్రిజిరేటర్‌లో పెడతారు. అయితే ఫ్రిజ్‌లోని చల్లని వాతావరణం కారణంగా, దీంట్లోని స్టార్చ్ తేమతో కలిసి బూజు ఏర్పడుతుంది. దీంతో చాలా వేగంగా ఎక్స్‌పైర్ అవుతుంది. బ్రెడ్ పాకెట్‌పై రాసిన ఎక్స్‌పైరీ డేట్ వరకు, దాన్ని రూమ్ టెంపరేచర్ వద్ద నిల్వచేసుకోవచ్చు, కానీ ఫ్రిజ్‌లో పెట్టకూడదు.చాలా మంది మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెడతారు. అయితే అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి త్వరగా విచ్ఛిన్నమై తేమ వాతావరణంలో బూజు పట్టడానికి కారణమవుతాయి. శీతల వాతావరణంలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. అందుకే ఫ్రిజ్‌లో పెట్టిన అన్నం తింటే ఫుడ్ పాయిజనింగ్‌ కావచ్చు. అలాగే మిగిలిన అన్నాన్ని మళ్లీ వేడి చేస్తే, పోషక విలువలు కోల్పోతాయి.

#foods #refrigerate
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe