Kidney Stones: కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి

కిడ్నీ స్టోన్స్ తో బాధపడేవారు తినే ఆహరం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలు తక్కువగా తీసుకోవాలని నిపుణుల సూచన. హై సోడియం, క్యాల్షియం, యానిమల్ ప్రోటీన్, కెఫిన్, ఆల్కహాల్ సమస్యను తీవ్రం చేస్తాయి. ఆహారంలో ఏదైనా చేర్చే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

New Update
Kidney Stones: కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా.. అయితే  ఇవి తప్పక తెలుసుకోండి

Kidney Stones:  శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. కిడ్నీ హెల్తీగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. దీన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో పరిస్థితి తీవ్రం ఆయేవరకు గమనించలేకపోతాము. సాధారణంగా ఈ మధ్య కాలం చాలా మందిలో కిడ్నీ స్టోన్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఆహారపు అలవాట్లు, జీవన శైలి విధానాలు కూడా ఈ సమస్య పై ప్రభావం చూపుతాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు ఆహరం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అయితే ఈ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా లేదా తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలు సమస్యను తీవ్రం చేసే అవకాశం ఉంది. అవేంటో తెలుసుకుందాం

కిడ్నీ స్టోన్స్ పై ప్రభావం చూపే ఆహారాలు

క్యాల్షియం ఫుడ్స్

వీలైనంత వరకు క్యాల్షియం కంటెంట్ ఉన్న ఆహారాలు తక్కువగా తీసుకోవాలి. అధిక క్యాల్షియం కారణంగా స్టోన్స్ ఫార్మ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. డైరీ ప్రాడక్ట్స్, ఆకుకూరలు, ఫార్టీ ఫైడ్ ఫుడ్స్ తక్కువగా తీసుకుంటే మంచిది.

సోడియం తక్కువగా తీసుకోవాలి

హై సోడియం కంటెంట్ యూరిన్ లో క్యాల్షియం శాతాన్ని పెంచుతుంది. ఇది స్టోన్స్ ఫార్మ్ అవ్వడానికి కారణమవుతుంది. అందుకే డైలీ డైట్ వీటిని తక్కువగా తినాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాన్డ్ సూప్స్, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించాలి. దూరంగా ఉంటే మరీ మంచిది.

Also Read: Mobile: చార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు..!

publive-image

ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్

పాలకూర, నట్స్, టీ, చాక్లెట్, తక్కువగా తీసుకోవాలి. దీనిలోని ఆక్షలెట్స్ క్యాల్షియం తో కలిసిపోయి స్టోన్స్ ను కలిగిస్తాయి. కుక్ చేయడం వల్ల ఆకుకూరలు, కూరగాయల్లో ఆక్షలేట్ లెవెల్స్ తగ్గుతాయి.

కెఫిన్ ఫుడ్స్

కెఫిన్ ప్రాడక్ట్స్ ఆల్కహాల్, ఇతర బెవరేజెస్ తీసుకోవడం డీ హైడ్రేషన్ కు దారితీస్తుంది. దీని వల్ల కిడ్నీ లో స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

నీళ్లు ఎక్కువగా తాగాలి

నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల యూరిన్ డైల్యూట్ కావడానికి సహాయపడుతుంది. ఇది కిడ్నీ స్టోన్స్ సమస్యను దూరం చేస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Ayodya Rama Mandir :అయోధ్య రామ మందిరం లో రామ్ లల్లాను సాధారణ భక్తులు ఎప్పుడు దర్శనం చేసుకోవచ్చు? దర్శన సమయాలు పూర్తి వివరాలు

Advertisment
తాజా కథనాలు