వర్షాకాలంలో వీటిని దూరం పెట్టాల్సిందే..లేదంటే రోగాలు ఖాయం..!! దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చల్లటి వాతావరణంలో టపటప చినుకులు పడుతుంటే..చాయ్, బజ్జీలు,పకోడీలు, ఫ్రైడ్ ఐటమ్స్, చిప్స్, ఇలాంటి ఆహారపదార్థాలను తింటుంటే ఆ మజానే వేరు. అయితే వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా వ్యాధులు పలకరిస్తుంటాయి. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ కాలంలో ఎక్కువగా ఆరోగ్యంపై ధ్యాస పెట్టడంతోపాటు..మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారపదార్థాలను మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. By Bhoomi 24 Jun 2023 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి వర్షాకాలం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలోనూ వర్షాలు నెమ్మెదిగా ప్రారంభమయ్యాయి. సూర్యుడి భగభగ ఈ వర్షాలతో ప్రజలు ఉపశమనం పొందుతున్నాయి. అయితే చల్లటి వాతావరణంలో వెచ్చగా...తినేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా బజ్జీలు, పకోడీలు, చిప్స్, ఫ్రైడ్ ఐటమ్స్ వాటిని ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఈ కాలంలో ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఆచుతూచి తినాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ కాలంలో వ్యాధులు ఎక్కువగా పలకరిస్తుంటాయి. కాబట్టి మనఆరోగ్యానికి ఎలాంటి ఆహారం ముఖ్యమో వాటి పైన్నే ఎక్కువగా శ్రద్ధపెట్టాలని సూచిస్తున్నారు. అయితే ఈ కాలంలో కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. అవి తింటే మీరు అనారోగ్యం పాలవ్వడం ఖాయమంటున్నారు. ఆ ఆహారపదార్థాలేంటో ఓసారి చూద్దాం. పానీపూరీ: పానీపూరి అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలేసుకుని తింటుంటారు. కానీ వర్షకాలంలో పానీపూరి అస్సలు తినకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పానీపూరి నీరు కలుషితం అయ్యే అవకాశం ఉండటంతో విరేచనాలు వంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే వర్షాకాలంలో పానీపూరి జోలికి వెళ్లకూడదు. పచ్చికూరగాయలు: మనలోచాలామంది పచ్చికూరగాయలు తినేందుకు ఇష్టపడుతుంటారు. అలా తినడానికి వేర్వేరు కారణాలు ఉండవచ్చు. కానీ వర్షాకాలంలో మాత్రం పచ్చికూరగాయలు తినకూడదని నిపుణులు అంటున్నారు. ఇలా తినడం వల్ల గ్యాస్ ఎసిడిటితోపాటు మరికొన్ని సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుందని చెబుతున్నారు. చేపలు, రొయ్యలు: వర్షాకాలం ప్రారంభం అవ్వగానే చేపలు, రొయ్యలు విరిగా లభ్యం అవుతుంటాయి. అయితే వర్షాకాలంలో ప్రారంభంలో వీటిని తినకూడదు. వర్షాలు పడుతుంటే అవి వాటిని సంతానాన్ని వ్రుద్ధి చేస్తుంటాయి. ఈ సమయంలో వీటిని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. పుట్టగొడుగులు: మష్రూమ్స్ తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మధ్యకాలంలో వీటివాడకం ఎక్కువైంది. ఇవి ఫంగస్ తో తయారు అవుతాయి కాబట్టి ఈ కాలంలో వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. ఫ్రైడ్ రెసిపిస్: ఇక వర్షాకాలంలో ముఖ్యంగా వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. బజ్జీలు, పూరీలు, పకోడీలు, జంక్ ఫుడ్ ఇవన్నీకూడా ఆరోగ్యాన్నిపాడు చేస్తాయి. కడుపు సంబంధిత సమస్యలకు కారణం అవుతాయి. మామిడిపండ్లు: వర్షాలు పడుతున్న సమయంలో మామిడిపండ్లను అస్సలు తినకూడదు. ఇవి పిత్తావాతకఫ దోషాలకు కారణమవుతాయి. ముఖంపై మొటిమలు ఏర్పాడతాయి. వర్షాలు పడగానే మామిడి పండ్ల పురుగులు ప్రారంభం అవుతాయి కాబట్టి వాటిని తినకూడదు. పెరుగు, పండ్ల రసాలు: ఇక వర్షాకాలంలో పెరుగు, ఫ్రూట్ జ్యూసులకు కూడా దూరంగా ఉండాలి. ఇవి మీకు ఇబ్బందులను కలిగిస్తాయి కాబట్టి ఈ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. పిల్లల విషయంలో జాగ్రత్త: ముఖ్యంగా వర్షాకాలంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. వేడి వేడి ఆహారాన్ని ఇస్తుండాలి. మసాల పదార్థాలను ఇవ్వకూడదు. మంచినీళ్లు వేడి చేసి ఇస్తుండాలి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి