Food Habits: మంచిగా మందేసిన వెంటనే పాలు తాగుతున్నారా? ఏమవుతుందో తెలుసా?

చికెన్, మటన్ తిన్న వెంటనే పాలు తాగకూడదు.. అలాగే, మద్యం తీసుకున్న వెంటనే కూడా పాలు తాగవద్దని అనేక మంది చెబుతూ ఉంటారు. అయితే.. మద్యం తాగిన కొద్ది సేపటి తరువాత పాలను తాగవచ్చని.. కానీ చికెన్, మటన్ తిన్న వెంటనే మాత్రం మిల్క్ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

New Update
Food Habits: మంచిగా మందేసిన వెంటనే పాలు తాగుతున్నారా? ఏమవుతుందో తెలుసా?

Food Habits: మన ఫుడ్.. డ్రింక్స్ కి సంబంధించి ఎన్నో అపోహలు.. అనుమానాలు ఉంటూనే ఉంటాయి. ఇవి తినకూడదు.. అవి తాగకూడదు.. ఇది తిన్న వెంటనే ఆ పని చేయవద్దు.. ఇటువంటివి తాగిన తరువాత అలా చేయకండి.. ఈ రెండు పదార్ధాలు కలిపి తినవద్దు.. ఇలా ఎన్నోరకాల అనుమానాలు వెంటాడుతూనే ఉంటాయి. వీటిని తీర్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ విషయాల్లో కొన్ని సరైనవి ఉంటాయి. కొన్ని తప్పుడు సలహాలు కూడా ఉంటాయి. ఇదిగో ఇప్పుడు అలాంటి కొన్ని సందేహాలకు సంబంధించి నిజానిజాలు తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ఒకటి ఏమిటంటే చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగకూడదు అనేది. దీనికి రీజన్ ఏమి చెబుతారంటే.. ఇవి తిన్న తర్వాత పాలు తాగడం వల్ల శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని. అందుకే , కాబట్టి చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు(Food Habits) తాగకూడదు అంటారు.  అయితే దీని వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకుందాం.

నిపుణులు ఏమంటారంటే.. 

ఈవిషయంపై(Food Habits) నిపుణులు మటన్ తిన్నాక పాలు తాగొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఈ రెండిటి మధ్య ఎలాంటి ప్రతికూల సంబంధం ఉండదు.  ఎటువంటి ప్రతికూల ప్రతిచర్యలకు సంబంధించి శాస్త్రీయ సమాచారం అందుబాటులో లేదు.  కానీ, అవి రెండూ అధిక మొత్తంలో ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి.  కాబట్టి అవి ఒకదానికొకటి సహాయపడతాయి. అందువల్ల, మీరు ఎటువంటి సమస్య ఎదుర్కోకుండా ఉన్నంత వరకు, మీరు చికెన్ - మటన్ తిన్నతర్వాత పాలు తాగవచ్చు. బహుశా లిమిట్ దాటి తిని పాలు తాగడం వలన అరుగుదల సమస్య రావచ్చని అలా అని పెద్దలు చెప్పి ఉండవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు. 

ఆల్కహాల్ తీసుకున్న వెంటనే.. 

అదేవిధంగా ఆల్కహాల్ తీసుకున్న వెంటనే పాలు(Food Habits) తాగకూడదని చాలా మంది నమ్ముతారు.  ఇందులో కొంత నిజం ఉంది. కొంత నిజం ఏమిటంటే.. ఆల్కహాల్ తాగిన వెంటనే పాలు ఎట్టిపరిస్థితిలోనూ తాగకూడదు. కానీ కొద్ధి సమయం తరువాత పాలు తాగితే అది ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్న కొద్దిసేపటి తర్వాత, పాలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది. మీరు దీని సహాయంతో  మంచి ఫలితాలను పొందవచ్చ అని వారంటున్నారు.  అందువల్ల, ఆల్కహాల్ తర్వాత పాలు త్రాగలేము అనేది కూడా చాలా వరకూ  అపోహ అని చెప్పవచ్చు. 

Also Read: Fixed Deposits: ప్రయివేట్ బ్యాంక్.. గవర్నమెంట్ బ్యాంక్ FD ఎక్కడ బెటర్?

Food Habits: అయితే,  కొందరు వ్యక్తులు పాలు.. పాలపదార్ధాలు వంటి వాటితో  మాంసాన్ని కలిపి తినేటప్పుడు జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు, కాబట్టి మీ శరీరం చెప్పే మాట వినండి. మీకు సౌకర్యంగా ఉంటేనే ఇటువంటి ఫుడ్ తీసుకోండి.  కొందరికి జీర్ణశక్తి పరిమితంగా ఉండడం వల్ల ఒకేసారి అంతగా జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణ సమస్యలు, అజీర్తి సమస్యలు వస్తాయి. అయితే ఈ రెంటినీ కలిపి తినడం వల్ల వచ్చే రియాక్షన్‌కి లింక్ చేయడం తప్పు.

పాలతో వీటిని ఎట్టిపరిస్థితిలోనూ తినకండి

Food Habits: అదేవిధంగా, పుల్లని పండ్లతో పాలు తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి.  కాబట్టి నారింజ, నిమ్మ నుంచి పైనాపిల్ వంటి పుల్లని పండ్ల తర్వాత వెంటనే పాలు తాగడం మానుకోవడం మంచిది. 

గమనిక: ఈ ఆర్టికల్ అవగాహన కోసం ఇచ్చినది మాత్రమే. వివిధ సందర్భాల్లో నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఆహార సంబంధిత విషయాల్లో అనుమానాలు ఉంటే కనుక వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నాం. 

Advertisment
Advertisment
తాజా కథనాలు