Healthy Ears : మీ చెవులు చెప్పే మాట వినండి.. ఈ తప్పులు చేయకండి.. 

మనం కళ్ళు.. దంతాలకు ఇచ్చిన ప్రాధాన్యత.. అత్యంత ముఖ్యమైన చెవులకు ఇవ్వము. చెవి విషయంలో ఎప్పుడూ అశ్రద్దగానే ఉంటాం. చెవిలో పుల్లలు..తాళాలు పెట్టి తిప్పేస్తాం. రోడ్డుపక్క కనిపించే వారితో చెవులను శుభ్రం చేయించేస్తాం. ఇవన్నీ చాలా ప్రమాదాన్ని.. చెవుల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

New Update
Healthy Ears : మీ చెవులు చెప్పే మాట వినండి.. ఈ తప్పులు చేయకండి.. 

Healthy Ears : మనమందరం సాధారణంగా మన  కళ్ళు - దంతాల విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకుంటాం.  అవి ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి, ఎప్పటికప్పుడు చెకప్స్ చేయించుకుంటూ ఉంటాం. అయితే, వాటిలాగే మన చెవులు కూడా శరీరంలో ముఖ్యమైన భాగం. కానీ, మన అలవాట్లు, అజాగ్రత్తల ద్వారా చెవుల(Healthy Ears) విషయంలో పెద్దగా శ్రద్ధ చూపించం. పైగా చెవుల విషయంలో చాలా   నిర్లక్ష్యంగా కూడా ఉంటాం. దీనివలన  చెవి నొప్పి, వాపు, ఇన్ఫెక్షన్, చెవిలో ఉత్సర్గ, చెవిపోటు వంటి అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, చెవుల ఆరోగ్యానికి క్రమం తప్పకుండా శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.

చెవులకు హాని ఇలా..
అనేక రకాల నిర్లక్ష్యం కారణంగా, గాయం, ఇన్ఫెక్షన్, ఎక్కువ హెడ్‌ఫోన్స్ ధరించడం, చెవిలో పత్తి లేదా వేలు పెట్టడం, బాహ్య ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్యలు చెవిలో(Healthy Ears) సంభవించవచ్చు. కొన్నిసార్లు చెవిలోపల చర్మం పగిలిపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్(Infection) రావచ్చు. అదే సమయంలో, అధిక గాలి పీడనం, చెవిలో గులిమి, సైనస్ ఇన్ఫెక్షన్, షాంపూ లేదా నీరు చెవుల్లోకి రావడం, చెవులను ఏదైనా ఇతర మార్గాలతో శుభ్రం చేయడం అలాగే అనుకోకుండా తగిలే లోపల గాయాలు కారణంగా చెవులు కొన్నిసార్లు దెబ్బతింటాయి.

శుభ్రపరచడం ముఖ్యం కానీ...
చెవులు(Healthy Ears) శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం, అయితే దీని కోసం సొంతంగా వివిధ పద్ధతులను ప్రయత్నించకూడదు. మరోవైపు, చాలా సార్లు మనం ఏమాత్రం ఆలోచించకుండా.. ఎటువంటి జ్ఞానం లేదా అనుభవం లేకుండా చెవులు శుభ్రం చేసుకుంటారు. చెవి శుభ్రపరిచే సర్వీసులకు మనకు  కొరత లేదు. అలా సర్వీసు చేసేవారు ఎక్కడికక్కడ కనిపిస్తారు. అలాంటి వారు చెవిలో రక్షణ కోసం ఉండే మైనం లాంటి పదార్ధాన్ని మురికి అని చెబుతారు.  దాని వల్ల చాలా తీవ్రమైన రోగాలు వస్తాయని చెప్పి మిమ్మల్ని భయపెడతారు. దీంతో చాలామంది వరిదగ్గరకు వెళ్లి చెవులు(Healthy Ears) శుభ్రం చేయించుకోవడం కనిపిస్తుంది. కానీ ఇది చెవిపోటుతో పాటు.. చెవిలో రంధ్రాలను కూడా కలిగిస్తుంది. ఎందుకంటే, వారు తీసి పడేసే ఈ వ్యాక్స్ ఎలాంటి ఇన్ఫెక్షన్‌ను చెవిలోకి చేరకుండా రక్షిస్తుంది. అంతేకాదు దీనివలన బయటి దుమ్ము, మట్టి రేణువులు చెవుల్లోకి చేరవు.

Also Read : పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గేది అప్పుడేనా? ప్రభుత్వం ఏమంటోంది?

చెవులకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, లేదా లోపల ఇయర్‌వాక్స్ నిండి ఉంటే, మీరు ENT వైద్యుని వద్దకు వెళ్లాలి. చెవులు శుభ్రం చేయడానికి, కనీసం ప్రతి ఆరు నెలల నుండి ఒకటిన్నర సంవత్సరాలకు ఒకసారి వైద్యుడిని సంప్రదించాలి.

శబ్దం సమస్యను పెంచుతుంది
ఈ రోజుల్లో పాటలు వినే సరదాలో పది చెవుల(Healthy Ears) ఆరోగ్యాన్ని మరిచిపోతున్నారు. ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌లు ధరించి అధిక వాల్యూమ్‌లో పాటలను వింటున్నారు. వాటిని చాలా ఎక్కువసేపు ఉపయోగిస్తున్నారు. ఈ శబ్దం చెవులకు హాని కలిగిస్తుంది. చెవిలో ఇయర్‌ఫోన్‌లు ఎక్కువసేపు ఉంచుకోవద్దు.  ఎక్కువసేపు లౌడ్‌స్పీకర్ దగ్గర ఉండకండి. 110-120 డెసిబుల్స్‌లో ఎక్కువసేపు సంగీతాన్ని ప్లే చేయడం వల్ల మీ చెవుల(Healthy Ears) కు హాని కలుగుతుందని గుర్తుంచుకోండి. అంతే కాకుండా అతి పెద్ద శబ్దంతో కూడిన పటాకులు, షార్ట్ బ్లాస్ట్ అంటే 120 నుంచి 155 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్ధం కూడా చెవులకు హాని కలిగిస్తుంది.

నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు
మీరు చెవులలో(Healthy Ears) తీవ్రమైన నొప్పిని కలిగి ఉంటే, చెవి నుండి నిరంతర చీము, ఒక చెవిలో వినికిడి కోల్పోవడం లేదా ఇతర రకాల సమస్యలు ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. దీని కోసం, డాక్టర్ కొన్ని యాంటీబయాటిక్స్, ఇయర్ డ్రాప్స్ ఇవ్వవచ్చు. ఈ సమయంలో, డాక్టర్ మీకు ఇచ్చిన మందుల కోర్సు రోజుల సంఖ్యను తగ్గించకుండా వినియోగించాలని  కూడా గుర్తుంచుకోవాలి. మధ్యమధ్యలో మందులు తీసుకోవడం ఆపకూడదు.

వాటికి దూరంగా ఉండాలి...

  • చెవుల్లో(Healthy Ears) దూది పెట్టకూడదు. క్లీనింగ్ లేదా దురద ఉన్నప్పుడు చెవుల్లోకి ఇయర్‌బడ్‌లు, కీలు లేదా ఇతర సన్నని వస్తువులను చొప్పించడం మానుకోండి.
  • ధూమపానం చేయవద్దు. ధూమపానం ప్రసరణ వ్యవస్థ ద్వారా వినికిడిని ప్రభావితం చేస్తుంది.
  • వినికిడి లోపం అనే సమస్య వృద్ధులకే వస్తుందని అనుకోకండి. పెద్ద శబ్ధానికి గురికావడం వల్ల యువతలో వినికిడి లోపం వచ్చే ప్రమాదం పెరుగుతోంది.
  • డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి మందులు.. నూనెలు చెవిలో వేసుకోవద్దు 
Advertisment
Advertisment
తాజా కథనాలు