Andhra Pradesh: వరద నీటిలో కొట్టుకుపోయిన 300 పాడి గేదెలు ..ఎక్కడంటే!

తూళ్లూరు మండలంలోని కృష్ణానది సమీపంలో లంక గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలో పెదలంకలో సుమారు 300 పాడి గేదెలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటికే 300 మంది గ్రామస్థులను అధికారులు సమీపంలోని ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పునరావాస కేంద్రానికి తరలించారు

New Update
విషాదం మిగిల్చిన వరదలు..చనిపోయినవారు ఎందరో!

Andhra Pradesh: తూళ్లూరు మండలంలోని కృష్ణానది సమీపంలో లంక గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే రాయపూడి పెదలంకలో సుమారు 300 పాడి గేదెలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సుమారు 300 మంది గ్రామస్థులను అధికారులు సమీపంలోని ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పునరావాస కేంద్రానికి తరలించారు.

ఇంకా 70 మంది బాధితులు పెదలంకలోనే ఉన్నారు. వారంతా కూడా ఇళ్ల పైకి ఎక్కి సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. వారందరిని కూడా హెలికాఫ్టర్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గ్రామంలో 170 కుటుంబాలు ఉండగా...సుమారు 400 మంది వరకు నివసిస్తున్నారు.

Also Read: యువ శాస్త్రవేత్తను మింగేసిన ఆకేరు వాగు!

Advertisment
తాజా కథనాలు