Positive Energy: వీటిపై ఫోకస్‌ పెట్టి చూడండి.. పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం

అవసరం అయినప్పుడు ఇతరులకు సాయం చేయడం, ఎమోషనల్ సపోర్ట్ అందించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మీ సొంతమవుతుంది. అనాథలకు సహాయం చేయడంతో పాటు ఇతరులను ఆపదలో ఆదుకోవడంవల్ల కలిగే అనుభూతి మనలో పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా నింపుతుంది.

Positive Energy: వీటిపై ఫోకస్‌ పెట్టి చూడండి.. పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం
New Update

Positive Energy: ప్రస్తుత కాలంలో చిన్న చిన్న సర్దుబాట్లు జీవశక్తిని పొందడానికి, పాజిటివ్ ఎనర్జీని నింపుతుందని నిపుణులు చెప్తున్నారు. లైఫ్‌లో ఎప్పుడూ ఎదో ఒక ఇబ్బందులే ఉంటాయి. కానీ రోజువారీ ఒత్తిళ్లు కూడా మనల్ని అలసిపోయేలా చేస్తాయి. అయితే.. సొంత ఆలోచన్లతోపాటు స్వయం ప్రతిపత్తి వరకు అనుభవాలు, అనుభూతులు, చేసే పనులు మనలో సానుకూల శక్తిని నింపుతాయి. ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి దోహదపడతాయి. పాజిటివ్‌ ఎనర్జీ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం:

  • మనిషి జీవితంలో శారీరక అవసరాలైన ఆహారం, నీరు, నిద్ర మొదలైనవి తీరినప్పుడు మాత్రమే కాకుండా.. మానసిక అవసరాలు తీర్చబడినప్పుడు చాలా శక్తిని, పాజిటివ్ ఎనర్జీని పొందుతామని పరిశోధలు చెబుతున్నారు. అలాంటి అవసరాలను తీర్చగలిగే వాటిలో స్వయం ప్రతిపత్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా ఉంది. ఇది ఓన్ బిహేవియర్స్‌ను కంట్రోల్ చేస్తుంది. కావున మనలో ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగని జీవితం మొత్తం మనం ఎంచుకునే విధంగానో, ఊహించిన విధంగానో ఉండకపోవచ్చు. కానీ కొంత సౌలభ్యం ఉన్నప్పుడు సొంత నిబంధనల ప్రకారం పనులు చేయడం వలన పాజిటివ్ ఎనర్జీని లభిస్తుంది.

ఇతరులకు స్వయంగా సాయంపై దృష్టి:

  • పాజిటివ్ ఎనర్జీ, జీవశక్తిని పెంచే మరో మానసిక అవసరం సోషల్ కనెక్షన్. అవసరం అయినప్పుడు ఇతరులకు స్వయంగా సాయం చేయడమో, ఎమోషనల్ సపోర్ట్ అందించడమో ప్రయోజనం ఇచ్చే పనులే. ఎప్పటికీ కలుసుకోని వారి కోసం ఏదైనా చేయడం కూడా సహాయపడుతుంది. ఓ అధ్యయనం ప్రకారం.. అనాథలకు ఏదైనా సహాయం చేయడంవల్ల, ఇతరులను ఆపదలో ఆదుకోవడంవల్ల కలిగే అనుభూతి మనలో పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా నింపుతుంది.

పనులపైనే ఫోకస్:

  • కొందరు ఇతరులు ఏం అనుకుంటారోనని తమకు నచ్చనివి, తాము చేయలేని పనులు చేస్తుంటారు. కానీ ఇలాంటి పనులతో నష్టంతోపాటు మానసిక, శారీరక అలసటకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం చేసే పనులు ఏవైనా మన సామర్థ్యానికి తగినవా, కావా? అని కూడా చూడాలి. పాజిటివ్ ఎనర్జీ పొందాలంటే చేయగలిగే పనులపైనే ఫోకస్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

పాజిటివ్ ఎనర్జీని పెంచే పనులు:

  • పనుల్లో, వృత్తుల్లో నిమగ్నమై ఉండే వారు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో ఉంటారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మనం చేస్తున్న పనిలో పూర్తిగా కేంద్రీకరించడంవల్ల సమయం గడిచిపోతున్నట్లు గమనించలేం. ఇలా గడిపినంతసేపు మానసికంగా ఇబ్బందికి గురిచేసే ఆలోచనలు దాడిచేయలేవు. పైగా పనిలో నిమగ్నమై ఉండటంవల్ల శారీరక, మానసిక వ్యాయామం జరుగుతుంది. పనిలో నైపుణ్యం పెరుగుతుంది.

ఇది కూడా చదవండి :  జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే కాబోయే పార్టనర్‌ని ఈ విషయాలు అడగండి

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#positive-energy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe