/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/flyover-collapsed-in-lb-nager.webp)
హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. సాగర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ర్యాంపు పిల్లర్ టు పిల్లర్ స్లాబ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 15మంది కార్మికులు గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బైరామల్ గూడా ఫ్లైఓవర్ పై మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకుంటుంగా అది పిల్లర్ కు తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడున్న కార్మికులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
అర్ధరాత్రి 3గంటల సమయంలో ఆ ప్రమాదం జరిగింది. కార్మికులంతా యూపీ, బీహార్ కు చెందినవారుగా తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషన్ సందర్శించారు. ఫ్లైఓవర్ కూలిపోయిన ఘటనలో ఉన్నతాధికారులతో దర్యాప్తు చేపిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. దీనికి కాంట్రాక్టర్ వైఫల్యమా లేదా ఇంకేదైనా కారణామా అని ఆరా తీస్తున్నట్లు చెప్పారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేలా అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
గాయపడిన వారి వివరాలు:
-యుపి కి చెందిన రోహిత్ కుమార్(25)
-పునీత్ కుమార్ (25)
-శంకర్ లాల్(25)
-రవికుమార్(26)
-బీహార్ కు చెందిన జితేందర్ కుమార్(26)
-హరేరామ్(22)
-విక్కి కుమార్(23)
-రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇంజనీర్ గోపాల కృష్ణ(29)