విమానంలో రక్తం కక్కుకుని వ్యక్తి మృతి!

New Update
విమానంలో రక్తం కక్కుకుని వ్యక్తి మృతి!

సోమవారం సాయంత్రం ఇండిగో విమానంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ముంబై విమానాశ్రయం నుంచి రాంచీకి బయలుదేరిన విమానంలో ఓ ప్రయాణికుడు ఆకస్మాత్తుగా రక్తం కక్కుకుని చనిపోయాడు.

విమానాశ్రయాధికారులు తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం సాయంత్రం ముంబై నుంచి రాంచీకి ఇండిగో విమానం బయల్దేరింది. అందులో 62 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఒకరు ఆకస్మాత్తుగా రక్తం కక్కుకున్నారు.

ఈ విషయం గమనించిన విమాన సిబ్బంది వెంటనే పైలట్‌ కు తెలియజేశారు. పైలట్‌ విమానాన్ని ఎమర్జెన్సీగా నాగపూర్‌ లో దించేశారు. విమానాశ్రయం నుంచి రక్తం కక్కుకున్న వ్యక్తిని దగ్గరలో ఉన్న కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

ఆ వ్యక్తిని పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తి సీకేడీ, ట్యూబరిక్యులోసిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

ఈ క్రమంలో పోలీసు అధికారులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. కిమ్స్ ఆసుపత్రి బ్రాండింగ్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ డీజీఎం ఎజాష్ షామీ ఈ వివరాలను వెల్లడించారు. ప్రయాణికుని పూర్తి వివరాలు సేకరించిన తరువాత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తామని ఆయన వివరించారు.

Advertisment
తాజా కథనాలు