లిబియాపై వరణుడు పగబట్టినట్లున్నాడు. భారీగా కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తడంతో 2వేలకు పైగా మంది మరణించారు. వేలాది మంది తప్పిపోయారు. అల్-మస్ర్ టెలివిజన్ స్టేషన్‌కు ఫోన్ ఇంటర్వ్యూలో, ప్రధాన మంత్రి ఒసామా హమద్ మాట్లాడుతూ, తూర్పు నగరమైన డెర్నాలో 2,000 మంది చనిపోయారని, వేలాది మంది తప్పిపోయినట్లు పేర్కొన్నారు. సోమవారం మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన ప్రధాని, దేశవ్యాప్తంగా జెండాలను ఎగురవేయాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: వారిద్దరి భేటీతో…ఉక్రెయిన్ గుండెల్లో గుబులు..!!
డేనియల్ తుఫాను తర్వాత వచ్చిన వరదలు డెర్నాలో భారీ విధ్వంసం సృష్టించాయని ఆయన అన్నారు. ఆ తర్వాత నగరాన్ని విపత్తు ప్రాంతంగా ప్రకటించారు. తూర్పు లిబియా ప్రభుత్వ ఆరోగ్య మంత్రి ఒత్మాన్ అబ్దుల్‌జలీల్ సోమవారం మధ్యాహ్నం సౌదీ యాజమాన్యంలోని న్యూస్ ఛానెల్ అల్-అరేబియాకు టెలిఫోన్ ఇంటర్వ్యూలో మరణించిన వారి సంఖ్యను ప్రకటించారు. కనీసం 50 మంది గల్లంతైనట్లు ఆయన తెలిపారు. ఈ మృతుల సంఖ్య విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించిన డెర్నా నగరం సంఖ్యను చేర్చలేదని అబ్దుల్‌జలీల్ చెప్పారు. సోమవారం మధ్యాహ్నాం వరకు ఇక్కడ పరిస్థితి తేలలేదు.
మృతుల్లో తూర్పు నగరమైన బైడాకు చెందిన 12 మంది ఉన్నారని నగరంలోని ప్రధాన వైద్య కేంద్రం తెలిపింది. అంబులెన్స్, ఎమర్జెన్సీ అథారిటీ ప్రకారం, ఈశాన్య లిబియాలోని తీరప్రాంత నగరం సుసాలో మరో ఏడుగురు మరణించినట్లు నివేదించింది. షాహత్, ఒమర్ అల్-ముక్తార్ పట్టణాలలో మరో ఏడుగురు మరణించినట్లు మంత్రి తెలిపారు. ఆదివారం మరో వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఇది కూడా చదవండి: చైనా మంత్రి అడ్రస్ గల్లంతు..ఇది కూడా జిన్ పింగ్ పనేనా..?
స్థానిక మీడియా ప్రకారం, డజన్ల కొద్దీ మంది జనం తప్పిపోయినట్లు నివేదించింది. వారంతా మరణించి ఉంటారని అధికారులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. తూర్పు లిబియాలోని అనేక నగరాల్లో వరదల ధాటికి ఇళ్లు, ఇతర ఆస్తులను ధ్వంసం చేశాయి. ప్రభుత్వం శనివారం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అర్థరాత్రి సంభవించిన తుఫానుకు ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలు మూసివేయబడ్డాయి. సోమవారం పశ్చిమ ఈజిప్ట్‌లోని కొన్ని ప్రాంతాలను తుఫాను తాకుతుందని భావిస్తున్నారు. దేశంలో వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.