AP Rains: హోం మంత్రి ఇంట్లోకి వరద నీరు

విజయవాడ లోని ఏపీ హోంమంత్రి అనిత నివాసం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆమె తన పిల్లలను ట్రాక్టర్‌ లో సురక్షిత ప్రాంతాలకు పంపించారు. అంతేకాకుండా అనిత తన ఇంటి కోసం వచ్చిన సహాయక బృందాన్ని సింగ్‌ నగర్‌ వైపు పంపించారు

New Update
AP Rains: హోం మంత్రి ఇంట్లోకి వరద నీరు

Home Minister Anitha: విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలకు హోంమంత్రి అనిత నివాసం కూడా నీటిలో చిక్కుకుంది. వరద నీరు చుట్టుముట్టడంతో ఆమె తన పిల్లల్ని ట్రాక్టర్‌ లో సురక్షిత ప్రాంతాలకు పంపించారు. రామవరప్పాడు వంతెన కింద ఆమె ఉండే కాలనీ జలదిగ్బంధమైంది. నిన్నటి నుంచి కూడా ఆమె నివాసం వరద ముంపులోనే ఉంది.

అయినప్పటికీ కూడా ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మరో వైపు విపత్తు నిర్వహణ శాఖ బృందం మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. తన ఇంటి దగ్గర కంటే కూడా ముంపు ప్రాంతాల్లో ముందు సహాయక చర్యలు చేపట్టాలని అనిత వారికి ఆదేశాలు ఆదేశించారు. కాలనీలో ఇతర కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆమె అన్ని ఏర్పాట్లను చేశారు. తన ఇంటి కోసం వచ్చిన సహాయక బృందాన్ని సింగ్‌ నగర్‌ వైపు పంపించారు.

Also Read: బెజవాడ-కోదాడ హైవే బంద్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు