మున్నేరు వాగు వరద ఉధృతి.. ఖమ్మంలో మూడో ప్రమాద హెచ్చరిక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.ప్రస్తుతం భద్రాచలం బ్రిడ్జి వద్ద నీటిమట్టం 41.2 అడుగులకు చేరింది.అటు పాలేరు రిజర్వాయర్‌తో పాటు మున్నేరు వాగుకు వరద ప్రవాహం పెరుగుతోంది. By Vijaya Nimma 27 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. వాగు సామర్థ్యం కంటే అత్యధికంగా వరద పెరిగి ప్రస్తుతం 28 అడుగులు ఎత్తుకు చేరుకోవడంతో పరివాహక ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగిపోయాయి. మున్నేరులో చేరిన వరద నీటితో మూడోవ పట్టణ ప్రాంతంలో పెద్దఎత్తున ఇండ్లు మునిగిపోవడంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి ఆదేశాల మేరకు కదిలిన జిల్లా అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం కాలవొడ్డు ప్రాంతంలో మోతేనగర్, మంచికంటినగర్, వాసవినగర్, పంపింగ్ వెల్ రోడ్డు పెద్దమ్మగుడి, బురద రాగాపురం, ఇండియన్ గ్యాస్ గోడౌన్ ప్రాంతంలే కాక సుందరయ్య నగర్, ధంసలాపురం, శ్రీనివాస్‌నగర్, ప్రాంతాల్లో నీటి మునిగిన ఇండ్లను సైతం అధికారులు పరిశీలించారు. సహాయక చర్యలు మున్నేరు వరద ఉధృతిని నగరంలో లోతట్టు ప్రాంతాలను రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ పరిశీలించారు.పెద్ద ఎత్తున సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా తలిపేరు ప్రాజెక్టు వల్ల మొన్నేరు వాగుకు వరద ఉధృతి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున మున్నేరు ప్రవహిస్తోందని అధికారులు చెప్పారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకున్న ప్రజలు ఈ వరదల్లో చిక్కుకొని నానా అవస్థలు పడుతున్నారు. దీంతో వ్యాపారుల వల్ల నష్టపోయిన బాధితులు ఎక్కడ విరుచుకుపడతారో అన్న ఆందోళనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వాగుకు ఆనుకొని ఉన్న దేవాలయాలు, స్మశానవాటికతో సహా మునిగిపోయాయి. అదేవిధంగా సుందరయ్యనగర్, పంపింగ్ వెల్ రోడ్డు పెద్దమ్మతల్లి గుడి దగ్గర్లో వేసిన వెంచర్లు నీట మునిగిపోయాయి. వరద ప్రాంతాలను సందర్శించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లోతట్టు ప్రాంత ప్రజలను పునరావసు కేంద్రాలకు వెంటనే తరలించాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైతే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వరద ఉధృతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత రాత్రి నుంచి నగరంలో ఎడతెరిపిలేకుండా కురుస్తోన్నవర్షంతో వాతావరణం భయానకంగా మారింది. దీంతో రాష్ట్రంలోని కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నేడు కూడా వాన తగ్గకపోవటంతో ఎడతెరిపి కురుస్తున్న వర్షానికి మున్నేరు నదికి వరద ఉధృతి పెరుగుతోంది. #flood-surge-for-the-third-time-third-danger-warning-in-khamma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి