Flipkart Offer: రూ.23,999 స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.15,999కే.. ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్!

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Vivo T2 5G స్మార్ట్ ఫోన్ ను రూ.23,999కి బదులుగా.. రూ.15999కే సొంతం చేసుకోవచ్చు.

Flipkart Offer: రూ.23,999 స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.15,999కే.. ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్!
New Update

దీపావళి ఆఫర్లు ముగిసినా.. ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) డిస్కౌంట్ల జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది. స్మార్ట్ ఫోన్లపై (Smartphone) అదిరిపోయే తగ్గింపులు అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. Poco, Realme, Samsung తదితర పవర్ ఫుల్ ఫోన్లను తక్కువ ధరకే ఫ్లిప్ కార్ట్ లో సొంతం చేసుకోవచ్చు. Vivo T2 5G స్మార్ట్ ఫోన్ పై బెస్ట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా Vivo T2 5G స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో రూ.23,999కి బదులుగా కేవలం రూ.15,999కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై రూ.5,333తో ప్రారంభమయ్యే EMI ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో అదిరిపోయే ప్రత్యేకత 64 మెగాపిక్సెల్ యాంటీ షేక్ కెమెరా, AMOLED డిస్‌ప్లే. Vivo T2 5G 1080 x 2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.38-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుది. డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. భద్రత కోసం, దానిపై Schott Xensation గాజు పొరను అందించారు.

ఇది కూడా చదవండి: Smartphone Battery Tips: ఈ ఫోన్ బ్యాటరీ టైం పెరగాలంటే..ఈ టిప్స్ పాటించండి..!!

64-మెగాపిక్సెల్ కెమెరా..

ఈ రోజుల్లో ఫోన్ కొనే ముందు అందరూ చెక్ చేసేది దాని కెమెరా. ఈ Vivo T2 5G ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో f/1.79 ఎపర్చర్‌తో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.4తో 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

పవర్ కోసం.. Vivo T2 5G 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ 5G-కనెక్టివిటీతో వస్తుంది. Vivo T2 5G Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా Funtouch OS 13పై పనిచేస్తుంది.

#flipkart #best-offers
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe