FilpKart Big billion days: ఫ్లిప్‌ కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్‌ సేల్‌ 2023.... అదిరే ఆఫర్లు ఇవే!

ఫ్లిప్‌ కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్‌ (FilpKart Big billion days)సేల్‌ 2023: అక్టోబర్‌ 8 వ తేదీ నుంచి ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌ కార్ట్‌ ప్లస్ సభ్యులు ఒక రోజు ముందుగానే ఈ డిస్కౌంట్‌ ఆఫర్లను పొందవచ్చు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచెస్‌, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ వంటి వస్తువులపై గొప్ప తగ్గింపు లభిస్తుంది.

New Update

ఈ ఏడాది గూగుల్‌ పిక్సెల్‌ 7 వంటి ఫోన్ల పై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. వీటిని బ్యాంకు కార్డుల ద్వారా కొంటే ఎక్స్‌ట్రా డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు. ఈ సేల్ లో మోటో జీ 54 5జీ, సామ్ సంగ్ గ్యాలక్సీ ఎఫ్‌ 34 5 జీ, రియల్ మీ సీ 51, ఇన్‌ఫీనిక్స్‌ జీరో 30 5జీ, మోటో జీ 84 5జీ, పోకో ఎమ్‌ 6 ప్రో 5జీ, ఐ ఫోన్‌ 14 సిరీస్‌, ఐ ఫోన్‌ 13, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్‌ 23 అల్ట్రా (Moto G54 5G, Samsung Galaxy F34 5G, Realme C51, Realme 115G, Realme 11x 5G, Infinix Zero 30 5G, Moto G84 5G, Vivo V29e, Poco M6 Pro 5G)తో పాటు మరికొన్ని స్మార్ట్‌ ఫోన్ల పై ఆఫర్లు ఉన్నాయి.

గూగుల్ కి చెందిన గూగుల్‌ పిక్సెల్‌ 7 అసలు ధర రూ.59 , 999 ఉండగా ఈ ఆఫర్లలలో దీనిని కేవలం రూ.36, 499 కే పొందొచ్చు. కొన్ని బ్యాంకుల కార్డులను వాడటం ద్వారా అదనంగా మరో రూ.2,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ హై ఎండ్ మొబైల్‌పై ఏకంగా 23,500 వరకు తగ్గింపు లభించనుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది.

గతేడాది మార్కెట్లోకి వచ్చిన నథింగ్‌ ఫోన్ 1 అసలు ధర రూ.32,999 ఉండగా ఇప్పుడు అది కేవలం రూ.23,999కే మనకు వస్తుంది. ఈ ఫోన్లో ఉండే సరికొత్త ఫీచర్లు యూజర్లను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో మరోసారి భారీ డిస్కౌంట్ తో వచ్చేస్తుంది నథింగ్‌ ఫోన్. ముందుగా మోటోరోలా ఫోన్‌తో ప్రారంభమై వీవో, ఇన్‌ఫీనిక్స్, ఐఫోన్‌, రియల్‌ మీ, సామ్‌సంగ్‌, పోకో, గూగుల్‌ పిక్సెల్‌, రెడ్‌ మీ పై ఆఫర్లు రానున్నాయి.

దీంతో వాటిని అసలు ధర కంటే తక్కువ ధరకే కొనేయోచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డులుంటే, వాటి ద్వారా ఆర్డర్ చేయడం వల్ల మరింత డిస్కౌంట్ పొందొచ్చు. ముఖ్యంగా యాక్సిస్‌, ఐసీఐసీఐ, కోటాక్‌, మహీంద్రా కార్డులకు ప్రత్యేక తగ్గింపు లభించనుంది.

ఈ మూడు బ్యాంకుల క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేస్తే 10 శాతం, తక్షణమే రూ.1500 వరకు తగ్గింపు లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు నుంచి కొనుగోలు చేస్తే 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అదనంగా మరో 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా పొందొచ్చు.

Advertisment
తాజా కథనాలు