Flipkart Big Billion Days: రూ.16 వేల స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6 వేలకే.. బిగ్ బిలియన్ డేస్ లో అదిరే ఆఫర్!

ఈ క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) అక్టోబర్ 8 నుంచి 15వ తేదీ వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ ను (Big Billion Days Offers) నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సేల్ లో రూ.16 వేల POCO M5 స్మార్ట్ ఫోన్ ను రూ.6 వేల ధరలోనే సొంతం చేసుకోవచ్చు.

Flipkart Big Billion Days: రూ.16 వేల స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6 వేలకే.. బిగ్ బిలియన్ డేస్ లో అదిరే ఆఫర్!
New Update

సెప్టెంబర్ నెల ముగిసింది. మరికొన్ని రోజుల్లోనే అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. ఈ నెల అంతా దసరా, దీపావళి పండుగల సందడే కనిపించనుంది. దీంతో పాటు భారీగా సెలవులు. వీటితో పాటుగా ఈ-కామర్స్ సంస్థలు ఆఫర్ల జాతరను ప్రకటించాయి. ఈ క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) అక్టోబర్ 8 నుంచి 15వ తేదీ వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ ను (Big Billion Days Offers) నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏడాదికి ఓ సారి నిర్వహించే ఈ సేల్ కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తాజాగా ఈ సేల్ డేట్స్ కూడా విడుదల కావడంతో ఆఫర్ల కోసం వెతుకుతున్నారు అనేక మంది. కొన్ని ఆఫర్లను ఇప్పటికే రివీల్ చేసింది ఫ్లిప్ కార్ట్. ముఖ్యంగా మీరు తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. ఈ సేల్ మీకు సూపర్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: FilpKart Big billion days: ఫ్లిప్‌ కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్‌ సేల్‌ 2023…. అదిరే ఆఫర్లు ఇవే!

POCO M5 స్మార్ట్ ఫోన్ ను అత్యంత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చని సేల్ పేజీలో పేర్కొంది ఫ్లిప్ కార్ట్. ఈ ఫోన్ అసలు ధర రూ.15,999 కాగా.. ఏకంగా 9 వేల డిస్కౌంట్ ఈ సేల్ లో ఉండనుంది. కేవలం రూ.6,999కే ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఇంకా రూ.2,333 ఈఎంఐ ఆఫర్ తో కూడా ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఇంకా సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లతో పాటు భారీగా ఎక్సేంజ్ ఆఫర్లు కూడా ఉండే అవకాశం ఉంది.

దీంతో ఈ ఫోన్ ను కేవలం రూ. 6 వేల ధరలోనే సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది, ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.7,777 గా ఉంది. ఇంకా సేల్ సమయలో బ్యాంక్ ఆఫర్లతో పాటు భారీగా ఎక్సేంజ్ ఆఫర్లు కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ ఫోన్ ను కేవలం రూ. 6 వేల ధరలోనే సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

#smartphones #flipkart-offers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe