ఢిల్లీ (Delhi) నుంచి అడీస్ అబాబాకు వెళ్తున్న ఓ విమానం(Flight) కాక్ పిట్ లో పొగలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లీంచి ఢిల్లీ లో ల్యాండ్ చేశారు.
విమానాశ్రయాధికారులు తెలిపిన వివరాల ప్రకారం...ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కాక్ పిట్ లో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
దీంతో విమాన సిబ్బంది విమానాన్ని వెనక్కి తిప్పి ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అదే విధంగా ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు సమాచారం అదించడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కాక్ పిట్ లో పొగలు వచ్చిన సమయంలో విమానంలో సుమారు 240 మంది ప్రయాణికులు ఉన్నారు.ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు
అసలు కాక్ పిట్ లో పొగలు రావడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఇలా జరిగిందని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
అయితే ఈ ఘటన గురించి ఇప్పటి వరకు ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ సంస్థ కూడా ఈ సంఘటన గురించి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. గతంలో కూడా ఇథియోపియన్ విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. రన్ వే మీద ఉన్న ఈ విమానాన్ని మరో విమానం రెక్క ఢీకొట్టింది.