Flight Charges Hike: వేసవి సెలవుల్లో విమాన ఛార్జీల మోత మోగుతుంది!

వేసవి సెలవులను గడపడం కోసం విమానంలో ఎక్కడికైనా వెళ్లాలని భావించేవారికి విమాన చార్జీల మోత తప్పదు. విస్తరా తన విమానాలను రద్దు చేసుకోవడం.. డిమాండ్ కు తగ్గట్టుగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఈ సీజన్ లో 20 నుంచి 25 శాతం ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని  నిపుణులు చెబుతున్నారు. 

New Update
Flight Charges Hike: వేసవి సెలవుల్లో విమాన ఛార్జీల మోత మోగుతుంది!

ఈ వేసవి సెలవుల్లో విమాన ప్రయాణికులకు పెద్ద షాక్ తగలనుంది. విమానయాన రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, విస్తారా విమానాల రద్దు.. విమాన ప్రయాణానికి బలమైన డిమాండ్ కారణంగా, విమాన ఛార్జీలలో 20 నుండి 25 శాతం(Flight Charges Hike) పెరుగుదల ఉండవచ్చు. వేసవికాలం ముమ్మరదశకు  చేరుకున్నప్పుడు అలాగే,  డిమాండ్‌కు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకోవడంలో ఉన్న సవాళ్లతో ఎయిర్‌లైన్ పరిశ్రమ ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ పెరుగుదల కనిపిస్తుంది. ఒక్కోసారి డిమాండ్ తట్టుకోవడం కోసం దేశీయ మార్గాల్లో కూడా పెద్ద విమానాలను వినియోగిస్తున్నారు.

ఛార్జీలు పెరిగే అవకాశం ఇందుకే..
పైలట్‌లతో సమస్యలను ఎదుర్కొంటున్న విస్తారా రోజుకు 25-30 విమానాలను లేదా మొత్తం సామర్థ్యంలో 10 శాతాన్ని తగ్గించింది. గో ఫస్ట్ దివాలా తీయడం అలాగే, మరిన్ని విమానాలు గ్రౌండింగ్ కావడం వల్ల దేశంలోని విమానయాన పరిశ్రమ ఇప్పటికే తక్కువ సంఖ్యలో విమానాలతో కార్యకలాపాలు సాగిస్తుండడంతో(Flight Charges Hike) ఈ పరిస్థితి వచ్చింది. ఇంజన్ సంబంధిత సమస్యల కారణంగా ఇండిగో 70 విమానాలను కొనుగోలు చేసింది.

ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం, మార్చి 1-7 మధ్య కాలంతో పోలిస్తే ఏప్రిల్ 1-7 మధ్య కాలంలో కొన్ని రూట్లలో స్పాట్ ఛార్జీలు 39 శాతం(Flight Charges Hike) వరకు పెరిగాయి. మరోవైపు ఢిల్లీ-బెంగళూరు విమానాల్లో వన్‌వే ఛార్జీలు 39 శాతం పెరిగాయి. కాగా ఢిల్లీ-శ్రీనగర్ విమానాల ఛార్జీలు 30 శాతం పెరిగాయి. ఢిల్లీ-ముంబై మధ్య ఛార్జీలు 12 శాతం, ముంబై-ఢిల్లీ మధ్య ఛార్జీలు 8 శాతం పెరిగాయి.

Also Read: మీరు మనిషేనా? అని ఇంటర్నెట్ లో మనల్ని అడిగే కాప్చా ఏమిటో తెలుసా?

ఎంత పెరిగింది..
ట్రావెల్ పోర్టల్ యాత్రా ఆన్‌లైన్‌లో ఎయిర్, హోటల్ వ్యాపారాల్లో సీనియర్ VP భరత్ మాలిక్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, దేశీయ - అంతర్జాతీయ మార్గాలతో సహా ప్రస్తుత వేసవి సెలవుల షెడ్యూల్‌లో సగటు విమాన ఛార్జీలు 20-25 శాతం మధ్య(Flight Charges Hike) పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. విమానాలను 10 శాతం తగ్గించాలన్న విస్తారా నిర్ణయం ప్రధాన దేశీయ రూట్లలో టిక్కెట్ ధరలపై ప్రభావం చూపిందని మాలిక్ అంటున్నారు. 

ఢిల్లీ-గోవా, ఢిల్లీ-కొచ్చి, ఢిల్లీ-జమ్ము, ఢిల్లీ-శ్రీనగర్ వంటి ప్రధాన మార్గాల్లో ధరలు సుమారు 20-25 శాతం పెరగడంతో, ఛార్జీలలో(Flight Charges Hike) గణనీయమైన పెరుగుదలను కనిపిస్తోంది.  విస్తారా విమాన సర్వీసులను తగ్గించడం, పెరుగుతున్న ఇంధన ధరలతో పాటు వేసవి సెలవుల ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ కూడా ఈ పెరుగుదలకు దోహదపడ్డాయని ఆయన చెప్పారు.

వేసవి పీక్ ట్రావెల్ సీజన్‌కు ముందు డిమాండ్ పెరగడం..  కొన్ని విమానాల రద్దు కారణంగా కొన్ని రూట్లలో స్పాట్ ఛార్జీలు 20-25 శాతం(Flight Charges Hike) పెరిగాయని ఇక్సిగో తెలిపింది. చివరిసారిగా విమానాలు రద్దు చేయడం వల్ల ఏర్పడిన తాత్కాలిక ఇబ్బంది ఇది అని ఆయన అన్నారు. విమాన షెడ్యూల్ సాధారణమైన తర్వాత, ఛార్జీలు కొన్ని వారాల్లో స్థిరీకరణ జరవచ్చని అంటున్నారు. భారత్ మాలిక్ ప్రకారం, లడఖ్, మనాలి, గోవా వంటి ప్రముఖ దేశీయ గమ్యస్థానాలకు విమాన ధరలు 20 శాతం పెరిగాయి.

Advertisment
తాజా కథనాలు