కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గిస్తున్న ఫ్లెక్సిబుల్ వర్క్.. వెల్లడించిన లేటెస్ట్ స్టడీ రొటీన్ ఆఫీస్ హవర్స్‌తో పోలిస్తే సౌకర్యవంతమైన పని గంటలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పదేళ్ల వరకు తగ్గించగలవని తాజా అధ్యయనం వెల్లడించింది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు వర్క్ హవర్స్ కంటే నిరంతరం మారే టైమింగ్స్ గుండెకు మేలు చేస్తాయని హార్వర్డ్ T.Hకి బృందం తెలిపింది. By srinivas 10 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి రొటీన్ ఆఫీస్ హవర్స్‌తో పోలిస్తే సౌకర్యవంతమైన పని గంటలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పదేళ్ల వరకు తగ్గించగలవని తాజా అధ్యయనం వెల్లడించింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు గల వర్క్ హవర్స్ కంటే వారానికొకసారి మారే టైమింగ్స్ గుండెకు మేలు చేస్తాయని హార్వర్డ్ T.Hకి చెందిన బృందం నిర్వహించిన ప్రయోగం ఆధారంగా తెలిపింది. ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు వారి వర్క్ షెడ్యూల్‌లలో మార్పుతో చాలా బెన్ ఫిట్స్ పొందినట్లు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. Also read :మందుబాబులకు మత్తెక్కించే వార్త…ఆల్కాహాల్ కూడా మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుందట..!! అయితే మొదటిసారి ప్రొఫెషనల్ లైఫ్, గుండె జబ్బు మధ్య సంబంధంపై పరిశోధనలు జరిపిన స్టడీ ఇదే. కాగా స్ట్రెస్‌ఫుల్ వర్క్‌ప్లేస్ కండిషన్స్, వర్క్-ఫ్యామిలీ సంఘర్షణలు తగ్గించబడినప్పుడు.. ఉత్పాదకత పెరిగింది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గింది. ముఖ్యంగా తక్కువ, మధ్యస్థంగా వేతనాలు చెల్లించబడుతున్న ఎంప్లాయిస్.. వర్క్ షెడ్యూల్స్, జాబ్ డిమాండ్స్ విషయంలో తక్కువ కంట్రోల్ కలిగి ఉంటారు. ఎక్కువ అనారోగ్య పరిస్థితులకు లోబడి ఉంటారు. ఈ పని వేళల్లో మార్పులు వారిలో కార్డియోవాస్క్యులర్ రిస్క్ తగ్గించాయని వివరించారు పరిశోధకులు. ఈ అధ్యయనం ప్రారంభంలో సిస్టోలిక్ రక్తపోటు, BMI, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్, ధూమపాన స్థితి, కొలెస్ట్రాల్ స్థాయిల, కార్డియోమెటబోలిక్ రిస్క్ స్కోర్ (CRS)ని లెక్కించారు పరిశోధకులు. ఇక్కడ అధిక స్కోర్ ఎక్కువ వ్యాధి ప్రమాదాన్ని సూచిస్తుంది. అలాగే 12 నెలల తర్వాత కూడా వీటిని నమోదు చేయగా ఆఫీసు టైమింగ్స్‌లో చేంజ్ చూసిన వారు ఆరోగ్యపరంగా 5.5 నుంచి 10.3 సంవత్సరాల వయస్సుకు సమానమైన CRSలో తగ్గుదలని అనుభవించారు. ముందుగా అధిక CRS ఉన్న 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సిబ్బంది కూడా మెరుగుదలను చూశారని ఆధారాలతో నిరూపించారు. ప్రస్తుతం ఈ జనరేషన్ బిజీ షెడ్యూల్ కు ఇదొక ఊరటనిచ్చే విషయమని, ఈ దిశగా వర్క్ కండిషన్స్ లో మార్చులు చేసుకోవడం ఉత్తమ మార్గంగా సూచించారు. #flexible-work #reduces-cardiovascular-risk #latest-study మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి