Telangana: ఆ ఒక్క మాటతో ఎమోషనల్ డ్యామేజ్.. కాంగ్రెస్ కొంప ముంచిన చిదంబరం..!

చిదంబరం చేసిన ఒక్క కామెంట్.. తెలంగాణ రచ్చ క్రియేట్ చేస్తోంది. చిదంబరం కామెంట్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్‌ను బతకనివ్వొద్దని రాశారు గుర్తు తెలియని వ్యక్తులు.

New Update
Telangana Election 2023: కాంగ్రెస్‌లో టికెట్ల చిచ్చు.. కొత్తవారికి ఇవ్వడంపై భగ్గుమన్న స్థానిక నేతలు

Chidambaram: ఆసరాగా అవుతాడని ఎన్నికల ప్రచారానికి పిలిస్తే.. అసలుకే ఎసరు పెట్టారని ఆ సీనియర్ నేతపై టి.కాంగ్రెస్(Congress) నేతలు ఉసూరుమంటున్నారు. రాక రాక వచ్చి ఎన్నికల వేళ పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టాడంటూ లోలోన గులుగుకుంటున్నారు నేతలు. మరి ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది సృష్టించి ఆ సీనియర్ లీడర్ ఎవరు? ఆయన ఏం చేశాడు? అసలేం జరిగింది? ఇంటస్ట్రింగ్ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నాటి కేంద్ర హోంమంత్రిగా చిదంబరంతో ఎన్నికల ప్రచారం చేయిస్తే ప్రయోజనం ఉంటుందని భావించారు లోకల్ కాంగ్రెస్ లీడర్. కానీ, ఆ ప్లాన్ కాస్తా చిదంబరం వ్యాఖ్యలతో బెడిసికొట్టింది. ఆయన వస్తే ప్రయోజనం ఏం జరిగిందో తెలియదుగానీ.. ఆయన చేసిన కామెంట్స్‌ను కవర్ చేయడానికి తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన చిదంబరం.. అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ ఏర్పాటైందన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, ఇందుకు క్షమాపణలు తెలియజేస్తున్నానని అన్నారు. చిదంబరం చేసిన ఈ ఒక్క మాట.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.

కాంగ్రెస్ మాంచి దూకుడుమీదున్న ఈ సమయంలో చిదంబరం చేసి ఒక్క కామెంట్.. అంతా తలకిందులు చేసేసింది. కాంగ్రెస్‌కు చిదంబరమే విలన్‌గా మారారంటూ ఆ పార్టీలోనే కిందిస్థాయి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత పని చేశావ్ చిదంబరం.. ఎమోషనల్ డ్యామేజ్ చేశావ్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ యువకుల ఆత్మహత్యలు జరిగినట్లు చిదంబరం వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. చిదంబరం వ్యాఖ్యల నేపథ్యంలో.. తెలంగాణ వ్యాప్తంగా ఫ్లెక్సీ వార్‌ నడుస్తోంది. తెలంగాణ యువకుల ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణమంటూ ప్లెక్సీలు వెలిశాయి. శుక్రవారం రాహుల్ గాంధీ రాకను నిరసిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ప్రత్యర్థులు. ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్‌ను బతకనివ్వొద్దూ అంటూ హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. అమరుడు శ్రీకాంతాచారితో పాటు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Also Read:

ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు.. హర్యానా హైకోర్టు సంచనల తీర్పు..

రెండోసారి బీజేపీకి గుడ్ బై చెప్పిన రాములమ్మ.. ఈసారి పార్టీని వీడటానికి ఆయనే కారణమా?!

Advertisment
Advertisment
తాజా కథనాలు