- ఆటోమొబైల్ గ్యారేజీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న అనిల్‌కుమార్
- గ్యారేజ్‌లో పనిచేస్తున్న మెకానిక్‌తో కలిసి కుట్ర
- రూ. 40 లక్షలు తీసుకొస్తుండగా కారును అడ్డగించి దోపిడీ
- 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మల్లికార్జున్ బౌరంపేటలో దుర్గా ఆటోమొబైల్ గ్యారేజీలో పనిచేస్తున్న మల్లేశ్‌తో కలిసి కుట్ర పన్నాడు. రెండు రోజుల క్రితం మాదాపూర్‌కు చెందిన తన స్నేహితుడి నుంచి రూ. 40 లక్షలు తీసుకురావాలంటూ ప్రస్తుత అకౌంటెంట్ సాయిరాం, మెకానిక్ మల్లేశ్‌కు చెప్పి మల్లికార్జున్‌కు పంపాడు. ఈ విషయాన్ని అనిల్ కుమార్‌కు మల్లేశ్ చేరవేశాడు. సూరారంలో ఉండే తన స్నేహితులు ఎం.శివచరణ్, ఎస్. వెంకటరమణ రాజుతో కలిసి శుక్రవారం ఉదయం బౌరంపేట వద్ద కారును అడ్డగించి సాయిరాంను నెట్టేసి డబ్బున్న బ్యాగుతో పరారయ్యారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితుల ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టారు. వాటి ఆధారంగా 24 గంటల్లోపే మల్లేశ్, అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులు నిన్న పోలీసులకు పట్టుబడ్డారు. దోచుకున్న నగదుతో నిందితులు ఐఫోన్‌తో పాటుగా మరో ఖరీదైన ఫోన్‌ను కొనుగోలు చేశారు. వారి నుంచి రూ. 37.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.