Shiva Puja: శివుడికి ఇలా పూజ చేయండి.. అన్ని మంచి ఫలితాలే దక్కుతాయి!

శివుడిని పూజిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. శివుడి దగ్గరికి వెళ్ళగానే రెండు చేతులు పెట్టి ఆవాహయామి అనాలి. శివుడికి వందే శంభు ఉమాపతి అనే ఒక శ్లోకం అంటే చాలా ఇష్టం. గుళ్లోకి వెళ్లి వెంటనే ఇలా ధ్యానం చేస్తే ఈ జన్మలో కావాల్సిన భుక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

New Update
Shiva Puja: శివుడికి ఇలా పూజ చేయండి.. అన్ని మంచి ఫలితాలే దక్కుతాయి!

Shiva Puja: హిందూ సంప్రదాయంలో పూజలకు ప్రత్యేక స్థానం ఉన్నది. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి దేవునికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ పూజల్లో ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా కొందరు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో శివ పూజ ఒకటి. శివునికి సోమవారం ఎంతో ప్రత్యేకమైన రోజు. ఆ రోజు శివుని పూజిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుందని నమ్ముతారు. అయితే పూజలు చేసే విధానాలు కొన్ని ఉంటాయి. వాటిని ఆ విధంగా చేస్తేనే ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఐదు పూజలు శివాలయంలో చేసే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

శివున్ని పూజించే విధానం:

  • ఐదు పూజలు శివాలయంలో చేసిన వారికి జీవితంలో తిరుగు ఉండదట. అంతేకాదు అలాంటి వారికి పునర్జన్మ కూడా ఉంటుదని చెబుతున్నారు.
    మొట్టమొదటి పూజ: ఆవాహన.. శివుడు దగ్గరికి వెళ్ళగానే ఇలా రెండు చేతులు పెట్టి ఆవాహయామి అనాలి.
  • రెండవ పూజ ధ్యానం: శివుడికి సంబంధించిన ఏదో ఒక శ్లోకం భక్తితో చదవాలి. మీరు ఏ ఆలయానికి వె ళ్లినా దేవుణ్ణి స్తోత్రం చేయాలి. స్తోత్రం చాలా గొప్పది.  భగవంతుని వర్ణించే అటువంటి కవిత్వమునకు ధ్యానమని పేరు ఉంది. ఆ ధ్యానంలో శ్లోకాలు చాలా గొప్పగా ఉన్నాయి . అందులో ముఖ్యంగా శివుడికి వందే శంభు ఉమాపతి అనే ఒక శ్లోకం అంటే చాలా ఇష్టం. గుళ్లోకి వెళ్లి వెంటనే ఇలా ధ్యానం చేయాటం వల్ల ఈ జన్మలో కావాల్సిన భుక్తి లభిస్తుంది.
  • 3వ పూజ ధూపం: ఈశ్వరుడికి అత్యంత ప్రీతి ప్రాతమైన ఉపచారంలో ధూపం ఒకటి. ధూపం బాగా ఇస్తే శివుడికి బాగా ఇష్టమట. సాంబ్రాణి , అగరత్తులు, ధూపుష్టిక్కులతో పొగ పెడితే వద్దంటే డబ్బు వస్తుంది.
  • 4వ పూజ దీపం: దీపం వెలిగిస్తే జ్ఞానం కలుగుతుంది.
  • 5వ పూజ: ప్రదక్షిణ.. ఏ ఆలయంలోకి వెళ్లిన ప్రదక్షిణ చేయాలి. భక్తితో మెల్లగా నడచుటు, చేతులు జోడించి దేవున్ని ధ్యానించాలి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు