New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/7-4-jpg.webp)
Karnataka : కర్ణాటక(Karnataka) రాష్ట్రం, ముఖ్యంగా రాజధాని బెంగళూరు(Bangalore) కొద్ది రోజులుగా తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. నీరు వనరులను కాపాడుకునేందుకు ప్రభుత్వ అధికారులు, పలు కమ్యూనిటీలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇందులో భాంగంగానే నీరు వృధా చేయకూడదని, జారీమాన వేస్తామని పలు ప్రకటనలు జారీ చేశారు. అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన 22 కుటుంబాలపై ఐదు వేల జరిమానా విధించారు.
రూ. 1.10 లక్షలు వసూల్..
ఈ మేరకు కావేరి నీటిని అనవసరంగా వాడుకున్నందుకు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు(BWSSB) 22 కుటుంబాల నుంచి రూ. 1.10 లక్షలు వసూల్ చేసినట్లు తెలిపింది. వారంతా కార్లు కడగటం, తోటకు నీళ్లు పట్టేందుకు తాగునీటిని ఉపయోగిస్తున్నట్టు సమాచారం అందడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: TS: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్!
ఫిర్యాదులపై వేగంగా స్పందన..
అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తున్నామని, నీటి కొరత(Water Scarcity) ను దృష్టిలో ఉంచుకుని హోలీ వేడుకలు పూల్ అండ్ రెయిన్ డ్యాన్స్ కార్యక్రమాలను బీడబ్ల్యూఎస్ఎస్‌బీ నిషేధించినట్లు పేర్కొంది. ఇక అపార్ట్‌మెంట్స్, లగ్జరీ హోటళ్లు, పరిశ్రమలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో నీటి వృధాను నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా పెట్టారు.
తాజా కథనాలు