Driverless Metro : ఇక నుంచి డ్రైవర్‌ లేకుండానే మెట్రో పరుగులు!

బెంగళూరు సిటీ మెట్రో రైల్వే స్టేషన్‌ను తదుపరి దశకు తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో డ్రైవర్లు లేకుండా నడిచే మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఇందుకోసం మెట్రో రైలు కోచ్‌ల తయారీకి చైనా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

New Update
Driverless Metro : ఇక నుంచి డ్రైవర్‌ లేకుండానే మెట్రో పరుగులు!

Bangalore Metro : దేశంలోని అత్యంత ముఖ్యమైన నగరాల్లో బెంగళూరు(Bangalore) ఒకటి. భారతదేశంలోని వివిధ నగరాలకు చెందిన ప్రజలు పని, విద్యతో సహా వివిధ కారణాల కోసం కర్ణాటక రాజధాని బెంగళూరులో నివసిస్తున్నారు. జనసాంద్రత ఉన్న బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చెన్నై తరహాలో మెట్రో సర్వీసును కూడా నడుపుతున్నారు.

ఈ పరిస్థితిలో బెంగళూరు సిటీ మెట్రో రైల్వే స్టేషన్‌(Bangalore City Metro Railway Station) ను తదుపరి దశకు తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో డ్రైవర్లు లేకుండా నడిచే మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఇందుకోసం మెట్రో రైలు కోచ్‌ల తయారీకి చైనా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
దీని ప్రకారం డ్రైవర్లు లేకుండా నడిచే మెట్రో రైళ్లను సిద్ధం చేయడం జరిగింది. గురువారం మెట్రో రైలు కోచ్‌లు బెంగళూరుకు చేరుకున్నాయి.

మెట్రో ఎల్లో లైన్‌ లోని సిల్క్‌ బోర్డ్‌ జంక్షన్‌, ఎలక్ట్రానిక్స్‌ సిటీ మీదుగా ఆర్వీ రోడ్డును బొమ్మసంద్రతో కలిపే 19. 15 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు. ముందు ఆరు కోచ్‌ లతో టెస్ట్‌ రన్‌ నిర్వహించనున్నారు. ఈ డ్రైవర్‌ లెస్‌ మెట్రో(Driverless Metro) కు మొత్తం 216 కోచ్‌ లను సరఫరా చేసేందుకు 2019 లోనే 15 వందల కోట్ల ఒప్పందం జరిగింది.

దాని ప్రకారం తయారైన మెట్రోని బెంగళూరుకి రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. జనవరి 24న చైనా నుంచి ఈ రైలు ఓడల ద్వారా చెన్నై పోర్టు(Chennai Port) కు రాగా అక్కడ నుంచి బెంగళూరు కు రోడ్డు మార్గం ద్వారా తరలించారు. టెస్టింగ్‌ లు అన్ని అయ్యే సరికి సుమారు ఆరు నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతానికి ఒక రైలు రాగా.. మే నాటికి మరో రెండు రైళ్లు అలా రైళ్లను తీసుకుని రావాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఎల్లో లైన్‌ని ప్రారంభించడానికి ఎనిమిది రైళ్లు అవసరం ఉంటుంది. దేశంలోనే చరిత్ర సృష్టించేందుకు బెంగళూరు మెట్రో ఉత్సాహంగా ఎదురు చూస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read : రూ. 17 వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని మోదీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు