America: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల మోత మోగుతుంది. వరుస కాల్పుల ఘటనలతో అమెరికా (America) ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. తాజాగా ఈ ఘటన అమెరికాలోని కాన్సాస్ సిటీ(Kansas City) లో చోటుచేసుకుంది. కాన్సాస్‌లో జరిగిన కాల్పుల్లో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
వీరిలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. ‘సిటీ చీఫ్స్ సూపర్ బౌల్’ అనే క్రీడా ఈవెంట్ సందర్భంగా ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు కాన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్టేసీ గ్రేవ్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు నిందితుడిని పట్టుకోవడంలో సహకరించినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు.
పోలీసులు పెద్దగా సమాచారం ఇవ్వలేదు
ఈరోజు జరిగిన ఘటన గురించి నేను బాధపడ్డాను అని గ్రేవ్స్ అన్నారు. అరెస్టయిన వ్యక్తుల గురించి పోలీసులు వెంటనే ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు.
కాల్పులకు గల కారణం ఇంకా తెలియరాలేదు
కాల్పులు జరపడానికి గల కారణాలను కూడా పోలీసులు వెల్లడించలేదు. గతేడాది డెన్వర్‌లో జరిగిన ఎంబీఏ ఛాంపియన్‌షిప్‌లో కూడా కాల్పులు జరిగాయి. అందులోనూ చాలా మందికి గాయాలయ్యాయి. ఈ కాల్పుల తర్వాత, పారిపోతున్న వ్యక్తుల చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం కూడా న్యూయార్క్‌లోని సబ్‌వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై కూడా కాల్పులు జరిగాయి.
Also read:పాలన మూగ ప్రేక్షకుడిగా చూస్తుండిపోయింది.. సందేశ్‌ఖలీ ఘటన పై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు!