వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం.. కాకినాడ సముద్ర తీరంలో ఏం జరిగిందంటే.? కాకినాడ తీరంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వేటకు వెళ్తున్న మత్య్సకారుల బోటులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు బోటు మొత్తం అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది11 మందిని సురక్షింతంగా ఒడ్డుకు చేర్చారు. By Jyoshna Sappogula 01 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Fire on Kakinada coast: ఈ మధ్య కాలంలో బోటు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని మత్య్సకారులు భయం భయంగా బ్రతుకుతున్నారు. గత నెలలో విశాఖ హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు కాలి బూడిదయ్యాయి. అయితే, ఈ ఘటన మరువక ముందే కాకినాడ తీరంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అసలేం జరిగిందంటే.? Also read: అలెర్ట్.. తుపాను ముప్పు.. ఏపీ, తెలంగాణకు వర్షాలు! కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వేటకు వెళ్తున్న మత్య్సకారుల బోటులో సడన్ గా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు బోటు మొత్తం అంటుకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన మత్య్సకారులు ఫాస్ట్ గా లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకేశారు. బోటు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్యూ ఆపరేషన్ చేశారు. సముద్రంలో కొట్టుకుపోతున్న 11 మందిని సురక్షింతంగా ఒడ్డుకు చేర్చారు. లైఫ్ జాకెట్లు ధరించడం, కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్యూ ఆపరేషన్ చేయడంతో మత్య్సకారులకు ప్రాణ ముప్పు తప్పింది. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.. Also read: ఎగ్జిట్ పోల్స్.. ఎప్పుడు ఎలా ప్రారంభం అయ్యాయో తెలుసా? #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి