/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Malaysian-Airways-flight.jpg)
Malaysian Airways flight:శంషాబాద్ నుంచి కౌలంపూర్ వెళ్తున్న విమానానికి ప్రమాదం తప్పింది. టేక్ ఆఫ్ అయిన తరువాత కూడివైపు ఇంజన్ లో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన పైలట్ ఎయిర్ పోర్ట్ సిబ్బందిని ల్యాండింగ్ కొరకు అనుమతి కోరాడు. అనుమతికి కాస్త సమయం పట్టడంతో కొద్దిసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ చేసేందుకు ఏటీసీ అనుమతి ఇవ్వడంతో విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేశారు. విమానంలో మొత్తం 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు విమాన సంస్థ పేర్కొంది. విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.